Ash Gourd : అధికంగా విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు అధికంగా కలిగిన ఆహారాల్లో గుమ్మడి కాయ ఒకటి. గుమ్మడి కాయ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గుమ్మడి గుమగుమలు లేని ఇళ్లు ఉండనే ఉండదు. గుమ్మడికాయల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో బూడిద గుమ్మడి కాయ ఒకటి. ఏ దిష్టి తగలకూడదని మనం బూడిద గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటాం. అయితే చాలా మంది ఇది దిష్టి తీయడానికి మాత్రమే పనికి వస్తుందని భావిస్తారు. కానీ మన సాంప్రదాయ ఆయుర్వేదంలో బూడిద గుమ్మడి కాయకు చాలా ప్రాధాన్యత ఉంది.
ఈ బూడిద గుమ్మడికాయ ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ప్రతి రోజూ ఒక గ్లాస్ బూడిద గుమ్మడి కాయ రసాన్ని తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. ఈ గుమ్మడికాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి… అలాగే దీనిని ఎలా వాడాలి… ఈ జ్యూస్ ను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బూడిద గుమ్మడికాయను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ బూడిద గుమ్మడి కాయ నుండి పావు వంతు భాగాన్ని తీసుకుని పైన ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత లోపలుండే గింజలను తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. తీసేసిన పొట్టును అలాగే గింజలను కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నూనెను జుట్టుకు రాసుకుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
అలాగే ఈ గింజలను పొడిగా చేసి పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే పురుగులు, క్రిములు నశిస్తాయి. కడుపు నొప్పి, వాంతులు వంటి కూడా తగ్గుతాయి. ఇలా తరిగిన బూడిద గుమ్మడికాయ ముక్కలను జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమం నుండి జ్యూస్ ను తీసుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను నేరుగా తాగవచ్చు లేదా తేనెను కలిపి తీసుకోవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఇందులో తేనెకు బదులుగా బ్లాక్ సాల్ట్ ను వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బూడిద గుమ్మడి కాయ జ్యూస్ ను రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వ్యాయామాలు చేసేటప్పుడు ఇతర జ్యూస్ లను తాగడానికి బదులుగా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ను తాగడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. వ్యాయామం చేసిన తరువాత ఈ జ్యూస్ ను తాగడం వల్ల కండరాలకు విశ్రాంతి కలిగి తిరిగి మరలా శక్తి లభిస్తుంది. ఈ జ్యూస్ లో అధికంగా ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. ఆందోళన, ఒత్తిడి వంటి వాటితో బాధపడే వారు ఈ జ్యూస్ ను ప్రతిరోజూ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దీనిని తాగడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు మూడు గ్లాసుల బూడిద గుమ్మడి జ్యూస్ ను తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో పాటు ఇతర మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్ లో తేనెను కలిపి తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. ఈ జ్యూస్ ను తాగడం మొదలు పెట్టిన దగ్గరి నుండి మన శరీరంలో వచ్చే మార్పును మనం గమనించవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.