Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఇవి మీకు గుర్తున్నాయా.. మీలో ఎంత మంది ఎంజాయ్ చేశారు..?

Admin by Admin
May 20, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తేదీ ఎప్పుడు మారుతుందో.. రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియటం లేదురా అని లంచ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేస్తూ తన ఫ్రెండ్‌తో అంటున్నాడు సుబ్బారావు. మన రోజుల్లో, అప్పుడు చేసిన అల్లరి అంటూ వారిద్దరి జ్ఞాపకాలు నెమరివేసుకున్నారు. ఇలా ఒక్క సుబ్బారావే కాదు.. మనలో చాలా మంది అటువంటి సుబ్బారావులు ఉన్నారు.

ఈ ఫోన్లు, ఇంటర్‌ నెట్‌లు లేనప్పుడు. ఆదివారం ఈటీవీలో వచ్చే పంచతంత్రం మీలో ఎంతమందికి గుర్తు ఉంది? అమ్మో హోం వర్కు చేయలేదు అని సోమవారం ఉదయం గుర్తుకు వస్తే.. గబగబా పుస్తకాల సంచి తీసి.. ఫాస్ట్‌ ఫాస్ట్ గా మీలో ఎంత మంది రాశారు? 90 కిడ్స్‌ నిజంగా చాలా అదృష్టవంతులం అనిపిస్తోంది కదా ఒక్కోసారి మీకు. అటు ఏడుపెంకులాట ఆడిన అనుభవం, చింతపిక్కలతో అష్టాచెమ్మా ఆటలు ఆడిన జ్ఞాపకం, ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లో పబ్జీ నుంచి సబ్‌ వే సర్ఫ్‌, పోకో వంటి ఆటలు చూడటం విచిత్రంగా అనిపిస్తోంది కదా..

do you remember these 90s kids memories

ఆరోజుల్లో అయితే కరెంట్‌ ఇలా 24 గంటలు ఉండేది కాదు.. ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలన్నట్లు పిల్లలందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. పవర్‌ రేంజర్స్‌, శక్తిమాన్‌ ప్రోగ్రామ్స్‌ బహు ఫేమస్‌ అప్పట్లో. మరి ఇప్పుడో.. పిల్లలు టీవీ కాదుకదా, సరిగ్గా ఒక దగ్గరే కూర్చోవటం లేదు. అరచేతిలో వైకుంఠం అన్నట్లు స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేయటం, కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్‌ క్లాసులు రావటం.. తప్పక పిల్లలకు సెపరేట్‌గా ఫోన్లు కొనటం పరిపాటిగా మారిపోయింది. కొన్నవాటిని పడేయలేము కదా.. ఇంక అవి వారి దగ్గరే ఉండటంతో.. వాటితో పిల్లలు మరో లోకంలో విహరిస్తున్నారు.

అప్ప‌ట్లో బాలల దినోత్సవం అంటే, ఆరోజు మహా సరదాగా ఉండేది. ప్రత్యేకంగా పిల్లలను చూడటం, తప్పు చేసినా ఉపాధ్యాయుడు గుర్రుగా చూటడటమే తప్పా, కొట్టే ఛాన్సు ఉండేది కాదు.. కానీ మరుసటి రోజు ఏం జరిగేదో మీకు తెలిసే ఉంటుందిగా..చాక్లెట్లు పంచేటప్పుడు.. నా వంతు ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూడటం తరువాత మన దగ్గరకే వస్తున్నప్పుడు.. మనల్ని కాదులే అన్నట్లు పట్టించుకోలేదు అన్నట్లు నటించటం గొప్ప అనుభూతులు కదా. అందరూ కూర్చొని జోక్స్‌ వేసుకోవటం, పాటల లహరి, సీతారాములు ఆటలో సీత వస్తే నేను కాదు సీత చెప్పటానికి, దాయటానికి అవస్థలు పడటం తలుచుకుంటుంటే అబ్బా ఆ రోజులు మళ్లీ వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది కదా? మరి మీలో ఎంత మంది పై ఆటలు ఆడారో కామెంట్‌ చేయండి!

Tags: memories
Previous Post

చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది?నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది?

Next Post

జీవితంలో మీరు ఏ రంగంలో అయినా విజ‌యం సాధించాలంటే క‌చ్చితంగా పాటించాల్సిన సూత్రాలు..

Related Posts

హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారు క‌చ్చితంగా ఈ టిప్స్‌ను పాటించాల్సిందే..!

July 20, 2025
పోష‌ణ‌

అర‌టి పండును ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుంది..?

July 20, 2025
హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

July 20, 2025
business

ఓలా స్కూటర్ కొనొద్దని యువతి ప్లకార్డు.. స్పందించిన సంస్థ ప్రతినిధులు

July 20, 2025
Off Beat

ఇప్పుడున్న కొండచిలువలు మనుషుల్ని మింగగలవా?

July 20, 2025
Off Beat

OYO అంటే ఇంత అర్థం ఉందా! ఈ మాత్రం తెలియకుండానే అక్కడికి వెళ్తున్నారా?

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.