Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది?నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది?

Admin by Admin
May 20, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు..మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వ‌ర్గానికి పోయే శ‌రీరాన్ని కాసేపు ప‌క్క‌నపెడితే న‌ర‌క ప్రయానం ఎలా ఉంటుందో గరుడ పురాణం పూర్తిగా వివ‌రించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత క‌ష్టాల‌తో య‌మ‌పురి ప్ర‌యాణం సాగుతుంది. హ‌త్య‌లు, అక్రమాలు, మాన‌భంగాలు, దొంగతనాలు, క‌రుడుగ‌ట్టిన నేరాలు చేసిన వాళ్లు త‌ప్ప‌కుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చ‌నిపోయే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ స‌రిగా మాటలు రావు. చావుకి ద‌గ్గ‌రైనా ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా.. ఏం మాట్లాడలేకపోతాడు. శరీరమంతా స్పర్శ నాశనం అయి ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుంది. దివ్యదృష్టి తెరుచుకుని చుట్టు జ‌రుగుతున్న ప్ర‌తి విష‌యాన్ని అర్థం చేసుకోగలుగుతారట.

ఇంకో క్ష‌ణంలో తాను చ‌నిపోతున్నా అని తెలియ‌గానే త‌న క‌ళ్ల ముందు య‌మ‌రాజు పంపిన య‌మ‌భ‌టులు క‌నిపిస్తారు. భ‌య‌క‌ర‌మైన రూపంలో క‌నిపించే యమదూతలను చూడ‌గానే నోరు త‌డారిపోతుంది. చ‌చ్చిన శ‌రీరం నుండి ఆత్మను తీసుకుని య‌మ‌దూత‌లు ప్ర‌యాణం ప్రారంభిస్తారు. వైత‌ర‌ణి న‌దీ ప‌రిహాక ప్రాంతంలో ఈ ప్ర‌యాణం అత్యంత భ‌యంక‌రంగా సాగుతూ ఉంటుంది. 47 రోజులు చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తూ ఆత్మ‌ను త‌మ వెంట తీసుకెళుతారు య‌మ‌దూత‌లు. ఈ ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరు.

what happens moments before you die how is the way of hell

ఇక ఆత్మ‌కు య‌మ‌భ‌టులు పెట్టే క్షోభ అంతా ఇంత కాదు. యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమధూతలు చాలా భయాందోళనకు గురిచేస్తారు. నరకంలో యమరాజు చెప్పే శిక్ష‌ల‌ గురించి వివరించి వ‌ణుకుపుట్టేలా చేస్తారు. ఈ స‌మ‌యంలో ఆత్మ ఏడవడం మొదలుపెడుతుంది. కానీ.. యమదూతలు జాలి, క‌రుణ‌, క‌నిక‌రం చూపించ‌కుండా మ‌రింత బాధ‌పెడుతూ ఆనంద‌ప‌డుతుంటారు. య‌మ‌పురి ప్ర‌యాణంలో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతుంటాయి. కానీ య‌వ‌భ‌టులు లేపి మ‌రీ కొర‌డాతో కొట్టుకుంటూ తీసుకెళుతారు. ఎక్క‌డ ఆగ‌డానికి అవ‌కాశం ఉండ‌దు. ఇక నా వ‌ల్ల కాద‌ని మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలు అతి కిరాతకంగా చ‌ర్నాకోల‌ల్లాంటి కొర‌డాల‌తో కొడుతారు. అగ్నిలా మండిపోతున్న ఇసుకలో న‌డిపించుకుంటూ తీసుకెళుతారు. ఆత్మలు అత్యంత బాధ‌క‌ర‌మైన ఆ దారిలో నడవలేకపోతాయి. అలాగే ఆకలితో ఉంటాయి. ఆ సమయంలో యమదూతలు ఆత్మలను కొరడాతో కొడుతూ మ‌రింత‌ నరకం చూపిస్తాయి.

ఇక ఎలాగోలా యమలోకానికి చేరిన వెంటనే యమరాజు చివ‌రి సారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు. ఇన్నాళ్లు ఉన్న త‌న శ‌రీరం అంత్య‌క్రియ‌ల‌ను చూసుకునే అవ‌కాశాన్ని క‌లిగిస్తాడు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా .? లేదా. ? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మ మళ్లీ కిందకు వ‌స్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే పిండ ప్రదానం చేయాలి. లేదా ఇక ఆత్మకు మోక్షం ఉండదు.

Tags: hellsoul
Previous Post

మీకు శ‌త్రువులు ఉన్నారా? అయితే చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాలు గుర్తుంచుకోండి.!

Next Post

ఇవి మీకు గుర్తున్నాయా.. మీలో ఎంత మంది ఎంజాయ్ చేశారు..?

Related Posts

mythology

శ్రీ‌రాముడి కంటే కూడా రామ‌నామం గొప్ప‌ద‌ని అంటారు.. ఎందుక‌ని..?

July 19, 2025
vastu

ఇంట్లో నెమ‌లి ఫించాన్ని పెట్టుకుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?

July 19, 2025
ఆధ్యాత్మికం

ఈ త‌ప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి నిల‌వ‌దు..!

July 19, 2025
వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

July 19, 2025
ఆధ్యాత్మికం

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం వారంలో ఉన్న 7 రోజుల్లో ఏయే రోజులు ప్ర‌యాణానికి అనుకూల‌మో తెలుసా..?

July 19, 2025
ఆధ్యాత్మికం

తొండం ఏ వైపు ఉన్న గ‌ణేషుని విగ్ర‌హాన్ని పూజిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి..?

July 19, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.