45$ Trillion ఈ సంఖ్య ని రూపాయల్లో కి మార్చి చూస్తే నేటి విలువ ప్రకారం 38 లక్షల , 14 వేల కోట్లు.. ఇది 2 శతాబ్దాల పాలనలో బ్రిటిషర్లు భారత్ నుంచి తరలించుకుపోయిన అధికారిక సంపద, స్వాతంత్రం పొందిన ఆగష్టు 15 , 1947 ముందు రోజు వరకూ కూడా ట్రైన్లు, నౌకల్లో కూడా భారీగా బంగారం, ఇంకా అనేక జాతి అపురూప సంపద తరలిపోయింది అని అంటారు… ఇదంతా అధికారికంగా చేసిన దోపిడీ, అనధికారికంగా ఎంత వెళ్లిపోయిందో తెలియదు, వీరు కాకుండా డచ్ వారు చేసిన దోపిడీ అదనం.. ఆఫ్రికా ఖండంలో బ్రిటీషర్ల దోపిడీ అసలు ఎన్ని లక్షల కోట్లో కూడా ఇప్పటికీ అంచనాకు అందట్లేదు.. బంగారం, వజ్రాలు, ఇతర ఖనిజాల దోపిడీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది..
ఇక శాంతికి ఆలవాలం అని గొప్పగా చెప్పుకునే ఒకమతానికి చెందిన ఘోరీ అనే వ్యక్తి 11-12 శతాబ్దాల్లో మొదలుపెట్టిన దోపిడీ, 17 వ శతాబ్దంలో బ్రిటిషర్లు వచ్చేవరకు చాలా కొనసాగింది, ఇక్కడ దోపిడీ అంటే భౌతికంగా బంగారమో వెండో మాత్రమే కాదు, మన భారత జాతి భౌతిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదల పై జరిగిన దాడి కూడా .. ఇక 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న క్రైస్తవ దేశాలు అనే వాదన, అంతకుముందు ఈ దేశాల్లో మతం లేదని చెప్పదలుచుకున్నారా? లేదంటే ఆ మతం వల్లే ఆ దేశాలు గొప్పవి అయ్యాయి అని చెప్తున్నారా?
సరే ఆ మతం వల్లే ఆయా దేశాలు గొప్పవి అయ్యారు అనుకుంటే, క్రీస్తు పుట్టిన దేశం బెత్లహేము ఉన్న పాలెస్తీనా లో ఇప్పటికీ ఎందుకు శాంతి లేదు? నిరంతరం యుద్ధ మేఘాలు ఎందుకు ఉన్నాయక్కడ? ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం, అంతులేని సంపద ఉన్న బ్రిటన్ దేశం , ఈరోజెందుకు దివాళా అంచుల్లో ఉంది? అత్యంత సంపన్నమైన దేశమని పేరున్న అమెరికా లో 2023 లెక్కల ప్రకారం 3.5 కోట్ల మందికి పైగా ఎందుకు బీదరికంలో ఉన్నారు? కాబట్టి ఆయా దేశాల వారికి దోపిడీ ద్వారా సమకూరిన సంపద, ఎలా వచ్చిందో అలాగే పోయింది.. దీనికీ మతానికీ ఏ సంబంధం లేదు. కానీ అవినీతి రాజ్యమేలినంత వరకు ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదు. ఇది జగమెరిగిన సత్యం.