పక్షులు ఎక్కడుంటాయి అని అడిగితే ఇదేం ప్రశ్న చెట్లపై ఉంటాయి అని చెబుతారు. ఎందుకంటే పక్షులు ఎక్కువగా చెట్ల పైనే నివసిస్తాయి కాబట్టి. అయితే కొన్ని పక్షులు కరెంటు తీగలపై వాలుతూ ఉంటాయి. అయితే అన్ని రకాల పక్షులు మాత్రం కరెంటు తీగలపై వాలలేవట. అలాంటి వాటిలో పావురం ఒకటి.
పావురాన్ని చెట్లపైన, కరెంట్ స్తంభాల పైన చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాకి, కొంగ, పిచ్చుక వంటి ఎన్నో పక్షులు కరెంటు తీగలపై, వైర్ల మీద వాలడం చూసినా.. పావురాన్ని మాత్రం ఎక్కువ చూడలేము. ఎందుకంటే.. పావురము సాధారణ పక్షుల లాగా కరెంటు తీగలపై గానీ, చెట్లపై గానీ వాలదు. ఎప్పుడూ కూడా ఇది గోడల మీద లేదా బిల్డింగ్‌ల మీద మాత్రమే వాలుతుంది.
అందుకు కారణం ఏమిటి కావచ్చు అని మీకు డౌట్ రావచ్చు. అందులో మర్మం ఏం లేదు పావురాల కాళ్ళు, ఇతర పక్షుల కాళ్ళకి తేడా ఉంటుంది. అందుకనే అవి చెట్లపై, కరెంటు తీగలపై వాలిన ఉండలేవు. అందుకే ఎక్కువగా జనవాసాల మధ్య అంటే ఇంటి గోడలు, బిల్డింగ్ లపై ఎక్కువగా ఉంటాయట. మీకు కూడా అనుమానం వస్తే ఓ సారి పావురాల గుంపుని పరీక్షించండి.