Hibiscus Plant : మనం ఇంటి ఆవరణలో అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. మనం పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో మందార మొక్క కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలసు. మందార పువ్వులుచూడడానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మనకు వివిధ రంగుల్లో మందర పువ్వులు లభిస్తాయి. దైవారాధనలో కూడా ఈ పువ్వులను మనం ఉపయోగిస్తాం. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఈ మందార పువ్వులను ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. మందార చెట్టు రసం కారం రుచిని కలిగి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. పేను కొరుకుడును, బట్టతలను నివారించడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శిరో రోగాలను నయం చేసి జుట్టును అందంగా ఉంచడంలో కూడా మందార చెట్టు సహాయపడుతుంది.
మందార పువ్వులతో తైలాన్ని చేసుకుని వాడడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ మందార తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందార పువ్వులను సేకరించి రుబ్బి రసాన్ని తీయాలి. ఆ రసానికి సమానంగా నల్ల నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనె కానీ కలిపి చిన్న మంటపై కేవలం నూనె మిగిలే వరకు మరిగించాలి. ఈ తైలం చల్లగా అయిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని రోజూ వాడడం వల్ల వెంట్రుకలు దృఢంగా, నల్లగా, ఒత్తుగా మారుతాయి. ఒంటి రెక్క మందార పువ్వులను సేకరించి వాటిని పూర్తిగా నల్లగా ఉన్న ఆవు మూత్రంతో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుని పేను కొరికిన చోట వేసి రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తగ్గి ఆ ప్రాంతంలో మరలా వెంట్రుకలు వస్తాయి.
పూర్తిగా వెంట్రుకలు ఊడి పోయిన వారు ఈ మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుని రోజుకు రెండు పూటలా వెంట్రుకలు ఊడిపోయిన చోట ఉంచి రుద్దుతూ ఉంటే నెమ్మదిగా మళ్లీ వెంట్రుకలు వస్తాయి. జుట్టు తెల్లబడిన పిల్లలు, నడి వయస్కులు పైన తెలిపిన మందార పువ్వుల మిశ్రమాన్ని వెంట్రుకులకు పట్టించి ఆరిన తరువాత కుంకుడు కాయలతో లేదా శీకాకాయలతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తుమ్మెద రెక్కల లాంటి జుట్టు కావాలనుకునే వారికి కూడా మందార చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒంటి రెక్క మందారపువ్వులను, గుంటగురివిందాకును, నీటి మీద తేలియాడే అంతర తామరాకును సమపాళ్లల్లో తీసుకుని విడివిడిగా నీడలో ఎండబెట్టి పొడిగా చేసి మూడు చూర్ణాలను కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. తెల్ల వెంట్రుకలు ఉన్న వారు ఈ మిశ్రమాన్ని నువ్వుల నూనెతో కలిపి బాగా నూరి వెంట్రుకుల కుదుళ్ల లోపలికి దిగేలా బాగా పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల వెంట్రుకలు నల్లగా మారి నిగనిగలాడుడూ ఉంటాయి.
కేవలం శిరోజాల సమస్యలే కాకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ కూడా మందార చెట్టు ఉపయోగపడుతుంది. 10 మందార ఆకులను పావు లీటర్ నీటిలో వేసి ఆ నీరు సగం అయ్యే వరకు మరిగించి వడకట్టి గోరు వెచ్చగా తాగుతూ ఉంటే బిగుసుకు పోయిన మలమూత్రాల విసర్జన సాఫీగా సాగుతుంది. ఫిట్స్, అపస్మారక స్థితి వంటి వాటితో బాధపడుతున్న వారు మందార చెట్టు బెరడును సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు 3 గ్రాముల చొప్పున ఒక టీ స్పూన్ తేనెతో కలిపి రెండు పూటలా 40 రోజుల పాటు తీసుకోవడం వల్ల ఫిట్స్, అపస్మారకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా మందార చెట్టును ఉపయోగించడం వల్ల మన జుట్టును అందంగా, నిగనిగలాడుతూ ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.