Sweet Potato Leaves : మనం చిలగడ దుంపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇతర దుంపల వలె చిలగడ దుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కాల్చుకుని, ఉడికించి తీసుకుంటూ ఉంటాము. ప్రస్తుత కాలంలో చిలగడ దుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చాలా మంది వీటిని తీసుకోవడం తగ్గించారు. అయితే చిలగడ దుంపల వలె చిలగడ దుంప ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు. ఈ ఆకులను ఇతర ఆకు కూరల వలె మనం వండుకుని తినవచ్చు.
ఇతర ఆకుకూరలతో కలిపి పప్పు, వేపుడు, కూర వంటి వాటిని తయారు చేసుకుని తినవచ్చు. చిలగడ దుంప మొక్కను మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆకులను కట్ చేసుకుని సులభంగా వండుకుని తినవచ్చు. 100 గ్రాముల చిలగడ దుంప ఆకుల్లో 42 కిలో క్యాలరీల శక్తి, 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల ప్రోటీన్, 5.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే 11మిల్లీ గ్రాముల విటమిన్ సి, 508 మిల్లీ గ్రాముల పొటాషియం, 14,720 మైక్రో గ్రాముల లూటిన్ జియోగ్జాంతిన్ ఉంటాయి. ఈ ఆకుల్లో 24 రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చిలగడ దుంప ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ ఆకులను తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
రక్తనాళాల్లో అడ్డంకులు ఏ్పడకుండా ఉంటాయి. కాలేయంలోని ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి కాలేయ కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చిలగడ దుంప ఆకులు మనకు సహాయపడతాయి. ప్రస్తుతకాలంలో జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను మనం ఎక్కువగా తీసుకుంటున్నాము. దీంతో చాలా మంది కాలేయ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఈ చిలగడదుంప ఆకులను తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఉంటుందని కాలేయం మరింత చురుకుగా పని చేస్తుందని నిపుణులు తెలయిజేస్తున్నారు. అలాగే ఈ ఆకులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా చిలగడదుంప ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.