బంగ్లాదేశ్, భారత సరిహద్దు కి 10km దూరం లో కొన్ని దశాబ్దాలు గా పెద్దగా వినియోగం లో లేని బ్రిటిష్ కాలం నాటి వైమానిక స్థావరాన్ని ఆధునీకరించడానికి చైనా సహాయం కోరింది అని అనధికార లీకులు బయటకి వస్తున్నాయి.
1000 ఎకరాలు పైగా విస్తరించి ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని చైనా కి lease కి ఇస్తే భారత్ కి తలనొప్పి గా మారే అవకాశం ఉంది. ఇది బంగ్లాదేశ్ ఆధునీకరణ లో భాగమా? కవ్వింపు చర్య అనేది చూడాలి. దీని గురించి భారత విశ్రాంత రక్షణ నిపుణులు స్పందిస్తూ………
నిఘా కి ఈ స్థావరాన్ని వినియోగించవచ్చు. ప్రత్యక్ష యుద్ధం లో ఇది ఉపయోగ పడదని. సరిహద్దు కి అంత దగ్గర గా ఉన్న వైమానిక స్థావరాలను వారు రక్షించుకోవడం కష్టమని.
క్షిపణులు, యుద్ద విమానాలే కాదు మన artilery guns( 40 km range) కూడా ఆ స్థావరాన్ని లక్ష్యం గా చేసుకుని నాశనం చేయగలవని. ఖరీదైన యుద్ధ విమానాలు, యుద్ద సమయం లో మన శత్రువులు అక్కడ మోహరించే అవకాశం ( భద్రత కోణం లో) తక్కువ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.