ఆక్రమించుకోవాలనుకోవడం లేదు కాబట్టి. ఆక్రమించుకుని ఎంచేసుకుంటాడు? వివరంగా చెప్తాను.. రష్యా మిలిటరీ ముందు ప్రపంచంలో ఎవరూ సరిపోరు. పుతిన్ కావాలనుకుంటే, యుక్రెయిన్ మాత్రమే కాదు, సగం యూరోప్ స్మశానమయ్యేది. యూరోప్ లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకుని పెట్టుకున్నారు. కాస్త మంటలు రాజేసి, అమెరికాకి వంత పాడుతున్న ఫిన్లాండ్, జర్మనీ లాంటి దేశాలకి వణుకు తెప్పించాడు. అవసరమైతే ఏదైనా చెయ్యగలను అని చూపించడమే పుతిన్ లక్ష్యం. పుతిన్ కి కావాల్సింది యుక్రెయిన్ ని స్మశానం చేసి ఆక్రమించుకోవడం కాదు. అమెరికా చేతిలో కీలుబొమ్మగా ఉన్న జెలెన్స్కీ (యుక్రెయిన్ ప్రెసిడెంట్) ని మార్చి, తన మాట వినే ప్రెసిడెంట్ ని పెట్టుకోవడం.
యుక్రెయిన్ ప్రజల మద్దతు లేకుండా అది జరగదు. యుక్రెయిన్ ప్రజలకి సాధ్యమైనంత నష్టం కలుగకుండా ఉండడానికే ప్రయత్నిస్తాడు. అసలు యుద్ధానికి కారణం యుక్రెయిన్ NATO లో ఉండాలనుకోవడం రష్యా కి నచ్చట్లేదు, కారణం NATO ఆవిర్భావమే రష్యా కి వ్యతిరేకం. అదే జరిగితే రష్యా సరిహద్దుల్లో అమెరికన్ బలగాలు వచ్చి కూర్చుంటాయి.. ఎందుకంటే NATO లో అమెరికా దే ముఖ్య పాత్ర. అమెరికా అంచలంచలుగా USSR నుంచి విడిపోయిన దేశాలని NATO లో చేర్చుకుంది. ఇప్పుడు USSR నుండి విడిపోయిన అతి పెద్ద దేశం యుక్రెయిన్ ని కూడా లాగాలని చూస్తోంది. సహనం కోల్పోయిన రష్యా యుద్ధానికి దిగింది.
రష్యా చెప్పిన షరతులకు ఒప్పుకుంటే ఈ మరణహోమాన్ని ఆపొచ్చు. కానీ జెలెన్సీ అమెరికా అండ చూసుకుని ఆ పని చేయట్లా. అదేంటంటే దేశ భక్తి, స్వేచ్ఛ, అభిమానం అని కబుర్లు చెప్తున్నాడు జనాలు ఛస్తోంటే. రష్యా కన్నా అమెరికా నే బలవంతుడు అనుకుంటున్నాయి కాబట్టే ఈ దేశాలన్నీ అమెరికా చెప్పినట్టు వింటున్నాయి, అది తప్పని పుతిన్ చెప్పాలనుకుంటున్నాడు. అమెరికా కి వచ్చిన నష్టమేమీ లేదు, అట్లాంటిక్ అవతల ఉంది. దొరికిందే ఛాన్స్ అనుకుని, యూరోప్ దేశాల్ని రష్యా మీదకి ఉసిగొల్పుతోంది. ఈ విషయం ఎంత త్వరగా ఆ దేశాలు అర్ధం చేసుకుంటాయో అంత త్వరగా యుద్ధం ముగుస్తుంది. భయపెట్టాలనుకుంటున్నాడు కాబట్టే ఇన్ని రోజులు పడుతోంది. స్మశానం చేసైనా ఆక్రమించుకోవాలనుకుంటే రష్యా కి ఒక రోజు పని.