ఖర్జూర పండును చూడగానే ఎవరికైన నోరూరడం సహజం. ఇది తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డేట్స్‌ని ఇష్టపడేవారు వాటినిఎక్కువగా కూడా తీసుకుంటారు. అయితే షుగర్ బాధితులు వీటిని తినాలంటే కాస్తా ఆలోచిస్తారు. ఎందుకంటే వీటిలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఈ చక్కెర కారణంగా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయని కాస్త ఆలోచనలో పడతారు. ఇంతకీ షుగర్ పేషెంట్లు వీటిని తినొచ్చో?లేదో? ఇప్పడు చూద్దాం..షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి.. రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్‌ల వంటివి చేస్తే గానుక.. రోజుకు ఒకటి నుంచీ మూడు ఖర్జూరాలు వచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదీ కూడా డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
2018లో జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఖర్జూరాన్ని 12 వారాల పాటు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్‌బిఎ1సి స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. ఖర్జూరాలను షుగర్ పేషెంట్స్ ఎలాంటి భయం లేకుండా తీసుకొవచ్చు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 55 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు. వీటిలోని ఫైబర్ కంటెంట్ కూడా షుగర్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లన్నీ కలిసి కార్బోహైడ్రేట్స్‌ని ఏర్పరుస్తాయని.. వీటిని తింటే బలం అందుతుందని నిపుణులు అంటున్నారు.
ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం, ఎసిడిటీ.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మధుమేహం ఉన్నవారు వాటి తీసుకోవడం పరిమితం చేయాలి. బీటా కెరటిన్, ల్యుటీన్, జియాగ్జాంతిన్ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయని.. తద్వారా పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి కొంతవరకు రక్షిస్తాయని అంటున్నారు. కణాలకు పొటాషియం అత్యవసరం. ఇది ఖర్జూరంలో దండిగా ఉంటుంది. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుందని.. ఇలా గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది . వోట్మీల్లో ఖర్జూరాన్ని జోడించడం వల్ల చక్కెర లేకుండా సహజమైన తీపిని పొందవచ్చు. సలాడ్లకు ఖర్జూరాలను జోడించడం వల్ల మీకు సమతుల్య భోజనాన్ని అందించవచ్చు.