Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌శ్న - స‌మాధానం

గ‌ర్భిణీలు బొప్పాయిని తిన‌కూడ‌దా.. డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

Admin by Admin
April 8, 2025
in ప్ర‌శ్న - స‌మాధానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. తల్లి అవ్వటం అంటే కేవలం ఒకరికి జన్మనివ్వటమే కాదు. ఆది ఆ స్త్రీమూర్తికి కూడా పునర్జనన్మలాంటిదే. అయితే మీరు లేదా మీ ఇంట్లోవాళ్లు ఎవరైనా ఎప్పుడైతే తల్లికాబోతున్నారు అని తెలిసిందే..పెద్దొళ్లు ఇక జాగ్రత్తలు చెప్పటం స్టాట్ చేస్తారు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అని. ఈ తినకూడదు అని చెప్పే లిస్ట్ లో బొప్పాయిపండు పక్కా ఉంటుంది. గర్భీణీలు బొప్పాయి తినకూడదని మనం చాలా సినిమాల్లో తెలుగు సీరియల్స్ అయితే బాగా చూసి ఉంటాం. అసలు నిజంగానే తినకూడదా..ఇందులో వాస్తవం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. గర్భిణిగా ఉన్న సమయంలో బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి కారణం ఏంటంంటే బొప్పాయిని తెంపినప్పుడు దాని నుంచి కారే తెల్లటి పదార్థం. ఇది ఒక ఎంజైమ్. దీంట్లో లేటెక్స్ ఉంటుంది. ఇది గర్భస్రావానికి దారి తీస్తుందని ఇప్పటివరకూ మనం నమ్ముతున్నాం.

బొప్పాయి పండులోని ఎంజైమ్ లు ప్రోస్టోగ్లాండిన్ ను విడుదల చేయడానికి దోహదపడతాయి. ప్రోస్టోగ్లాండిన్ గర్భాశయం సంకోచించేలా చేస్తుంది. దీనివల్ల గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2002లో ఎలుకల మీద చేసిన ఓ అధ్యయనంలో పండిన బొప్పాయి తిన్న ఎలుకల్లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అవి సురక్షితంగానే ఉన్నాయి. అదే సమయంలో పచ్చి బొప్పాయిపండు తిన్న ఎలుకల్లో అబార్షన్, సమయం కంటే ముందే డెలివరీ అయిందట. అయితే మనుషుల మీద ఇలాంటి ప్రయోగాలు ఇప్పటివరకూ జరగలేదు. అంతేకాదు ఏ అధ్యయనం కూడా బొప్పాయి వల్ల అబార్షన్ అవుతుందన్నదానికి ఖచ్చితమైన ఆధారాలను చూపలేదు. అయితే, గర్భిణిలు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

can pregnant women take papaya what doctors say

బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. గర్భిణీలు తినొచ్చు కూడా.. కానీ అదే పచ్చి బొప్పాయి వల్ల గర్బాశయ గోడలు సంకోచానికి గురవ్వడం, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా తొలిసారిగా గర్బిణీలకే అవుతుందట. బొప్పాయిలో కెరోటిన్ ఉంటుంది. ఇది వాస్కులర్ ప్రెజర్ కు దారి తీస్తుంది. దీనివల్ల ప్లాసెంటాలో ఇంటర్నల్ బ్లీడింగ్ కు అవుతుంది. అందుకే గర్భిణులు బొప్పాయి తినాలనుకుంటే.. తినేముందు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాల్సిందే. మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది..ఎవరైనా త్వరగా పిరియడ్స్ రావాలనుకుకంటే పచ్చిబొప్పాయి తింటారు..ఎందుకంటే పచ్చి బొప్పాయి పండు తినడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ సింథసిస్ అవుతుంది. ఈస్ట్రోజన్ వల్ల గర్బాశయ గోడలు సంకోచిస్తాయి. దానివల్ల తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

ఇదండి..బొప్పాయి తినకూడదు..తింటే గర్భ‌స్రావం అ‌వతుంది అని మాత్రమే కాదు..అసలు ఎందుకు తినకూడదు..తింటే ఏం జరుగుతుంది బాడీలో అనేది కూడా ప్రతిమహిళకు అవగాహన ఉండాలి. గర్భిణీలు పచ్చిబొప్పాయి తినకూడదు అంతే..బాగా పండిన బొప్పాయి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు వైద్యులు. బొప్పాయిలో మంచి మంచి పోషకవిలువలు, విటమిన్స్ ఉన్నాయి. మీకు బొప్పాయి అంటే ఇష్టం ఉండి..గర్భిణీగా ఉన్నట్లైతే ఇదే విషయాన్ని ఓ సారి మీ డాక్టర్ కి సంప్రదించి తినండి.. వైద్యలు కూడా ఇదే చెప్తున్నారు.

Tags: papayapregnant women
Previous Post

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌ల‌గాలంటే మీ ఇంట్లో ఇలా చేయండి..!

Next Post

గ‌ర్భిణీలు ఈ ఆహారాల‌ను త‌ప్ప‌క తినాలి..!

Related Posts

inspiration

2 సార్లు జీవితంలో ఫెయిల్ అయ్యాడు.. అయినా కుంగి పోలేదు.. చివ‌ర‌కు స‌క్సెస్ అయి ల‌క్ష‌ల కోట్ల సంపాదించాడు..

May 30, 2025
Off Beat

కట్టెలపొయ్యి మీద చేసిన వంటలు ఎందుక‌ని రుచిగా ఉంటాయి..?

May 30, 2025
mythology

బార్బ‌రీకుడు.. మ‌న ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌.. రెండూ ఒక్క‌టే.. ఎలాగంటే..?

May 30, 2025
వినోదం

పాచువుమ్ అద్భుత విలక్కుమ్.. సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌కు ప్ర‌తిబింబిం ఈ సినిమా..

May 30, 2025
inspiration

ధోతి కట్టుకుంటే అవమానించారని. అదే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాడు.. ఈయన సక్సెస్ స్టోరీ ఇది..

May 30, 2025
food

పెరుగు లేకుండా పాలు ఎలా తోడు పెట్టాలి?

May 30, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!