Fish And Eggs : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మాంసాహారాల్లో చేపలు ఒకటి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చేపలను వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. ఇక చేపలను తినని చాలా మంది కోడిగుడ్లను కూడా ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్లతోనూ మనం అనేక రకాల వంటలను తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రెండింటినీ కలిపి తినవచ్చా.. అని చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. మరి దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!
కోడిగుడ్లను, చేపలను కలిపి తినవచ్చు. ఎలాంటి హాని జరగదు. కొన్ని ఆసియా దేశాల వాసులు కోడిగుడ్లను, చేపలను కలిపి వండి కూడా తింటుంటారు. కనుక ఈ రెండింటినీ కలిపి తినవచ్చు. దీని వల్ల ఎలాంటి హాని కలగదు. అయితే చేపలు లేదా కోడిగుడ్లు కొందరిలో అలర్జీలను కలగజేస్తాయి. అలాంటి వారు మాత్రం ఈ రెండింటినీ కలిపి తినకపోవడమే మంచిది. చేపలను లేదా కోడిగుడ్లను తినడం వల్ల అలర్జీ వస్తుందని అనుకునేవారు ఈ రెండింటినీ అసలు కలపకూడదు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని సురక్షితంగా తినవచ్చు. ఇక మిగిలిన ఎవరైనా సరే ఈ రెండింటినీ కలిపి తినవచ్చు. అందులో ఎలాంటి సందేహాలకు గురికావల్సిన పనిలేదు.
కోడిగుడ్లను, చేపలను తినడం వల్ల మనకు అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం.. మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రోటీన్లను అందించే ఆహారాలలో టాప్ 10 జాబితాలో కోడిగుడ్లు, చేపలు కూడా ఉన్నాయి. ఒక కోడిగుడ్డు ద్వారా మనకు రోజుకు కావల్సిన ప్రోటీన్లలో 13 శాతం వరకు ప్రోటీన్లు లభిస్తాయి. అదే ఒక చేప అయితే గరిష్టంగా 25 శాతం వరకు ప్రోటీన్లను పొందవచ్చు. కనుక ఈ రెండింటినీ తింటే మనకు ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
కోడిగుడ్లు, చేపలను తినడం వల్ల మన శరీరానికి లభించే ప్రోటీన్లను శరీరం సులభంగా శోషించుకుంటుంది. వాటిల్లో ఉండే 98 శాతం ప్రోటీన్లను శరీరం గ్రహిస్తుంది. పైగా ఇవి సులభంగానే జీర్ణమవుతాయి. కనుక ఇతర పోషకాలు కూడా మనకు సులభంగానే లభిస్తాయి. కాబట్టి ఈ రెండింటినీ తీసుకుంటే మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.