క్రికెట్ లో మూడు ఫార్మర్స్ ఉంటాయి. టెస్ట్ క్రికెట్, టి-20, వన్డే ఫార్మాట్ ఇలా మూడు ఫార్మర్స్ ఉంటాయి. ఇక టెస్ట్ క్రికెట్ అంటే ఆటగాళ్ల సహనం, ప్రతిభకు ఒక సవాల్ లాంటిది. టెస్ట్ క్రికెట్ లో వారి బలం ఏమిటో తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లలో బ్యాటర్స్ విధ్వంసంగా ఆడుతూ ఉంటారు. మొదటి బంతి నుంచే బౌండరీల ద్వారా భారీ స్కోర్స్ సాధించాలని భావిస్తూ ఉంటారు. ప్రతి బంతిని సిక్స్ కొట్టి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని అభిమానులు కూడా అనుకుంటారు. ఇక అలా టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ టీ20లకు గుడ్ బై చెప్పగా మొత్తం 159 మ్యాచ్‌లలో 205 సిక్సులు బాదాడు. రోహిత్ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ ఉన్నాడు. 122 మ్యాచ్‌లు ఆడిన గప్తిల్ 173 సిక్సులు కొట్టాడు. గప్తిల్ కూడా అంతర్జాతీయ టీ20లకు ఎప్పుడో స్వస్తి పలికాడు. మూడో స్థానంలో 69 మ్యాచ్‌లలో 158 సిక్సులతో యూఏఈ ప్లేయర్ మహమ్మద్ వసీమ్ ఉన్నాడు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్ ఉన్నాడు. 134 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 152 సిక్సులు బాదాడు.
5వ స్థానంలో విండీస్ ప్లేయర్ నికోలాస్ పూరన్ ఉన్నాడు. 106 మ్యాచ్‌లు ఆడిన పూరన్ 149 సిక్సులు కొట్టాడు. 6వ స్థానంలో భారత బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. 83 మ్యాచ్‌లు ఆడిన సూర్య 146 సిక్సులు కొట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్ 116 మ్యాచ్‌లలో 137 సిక్సులు కొట్టి ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్8వ స్థానంలో ఉన్నాడు. 130 మ్యాచ్‌లలో ఇతను 130 సిక్సులు కొట్టాడు. ఐర్లాండ్‌కు చెందిన స్టెర్లింగ్ 150 మ్యాచ్‌లలో 129 సిక్సులు కొట్టి 9వ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ 103 మ్యాచ్‌లలో 125 సిక్సులు కొట్టి ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు.