బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియాల మధ్య కొనసాగుతున్న ఆండర్సన్, టెండుల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఓ యువతి ఇండియన్ టీమ్ జెర్సీ ధరించి బుమ్రా వైపు నవ్వుతూ చూస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆ యువతి ఎవరు, ఆమె ఇండియన్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం చేస్తుంది..? అసలు ఆమె వివరాలు ఏమిటి..? అని చాలా మంది తెలుసుకోవడం కోసం ఆమె గురించి వెదకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె బుమ్రా వైపు నవ్వుతూ చూస్తున్న ఫోటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక ఆమె ఎవరు అంటే..?
సాధారణంగా ఏ జట్టు అయినా ఒక దేశంలో పర్యటనకు వచ్చినప్పుడు ఆతిథ్య జట్టు వారికి సదుపాయాలను కల్పిస్తుంది. ప్రస్తుతం ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది కనుక ఇండియాకు ఇంగ్లండ్ అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. అందులో భాగంగానే ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం తరఫున ఒక వ్యక్తిని ప్రతినిధిగా పంపిస్తారు. ఆ ప్రతినిధి పర్యటించే జట్టు అయిన భారత్‌కు అన్ని సదుపాయాలు సక్రమంగా లభిస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తారు. జట్టు ప్రయాణం, బస, స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం వంటి విషయాల్లో ఆ ప్రతినిధి జట్టుకు సహాయంగా ఉంటారు. ఏమైనా అవసరం అయితే ఆతిథ్య జట్టుతో మాట్లాడి సదుపాయాలు అందేలా చూస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమెను ఇంగ్లండ్ జట్టు భారత్ కోసం సహాయకారిగా నియమించింది. ఇక ఆమె పేరు యాస్మిన్ బదియాని. ఆమె ఒక ఫిజియోథెరపిస్టు.
యాస్మిన్ ఇంగ్లండ్‌లో ఉన్న యూనివర్సిటీ ఇఫ్ లీసెస్టర్ నుంచి 2010లో ఫిజియో థెరపిస్టుగా పట్టా పొందింది. ప్రస్తుతం భారత్ కోసం ఇంగ్లండ్ నియమించిన జట్టు సహాయకారిగా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆమె భారత్‌కు పనిచేస్తుంది కనుకనే ఆమె ఇండియన్ టీమ్ జెర్సీలో ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంది. అయితే ఆమె బుమ్రా వంక నవ్వుతూ చూడడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా వస్తుండడం విశేషం. ఇక రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 427 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. 5వ రోజు మిగిలిన 7 వికెట్లను తీస్తే ఇండియా ఈ టెస్టులో విజయం సాధిస్తుంది.