Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

ద‌డ పుట్టిస్తున్న డిజిట‌ల్ అరెస్ట్ స్కామ్.. ఈ పేరుతో స‌రికొత్త మోసాలు..!

Sam by Sam
October 15, 2024
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ మ‌ధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి.ప్ర‌జ‌ల‌ని మోసం చేసేందుకు స‌రికొత్త ప్లాన్స్ చేస్తున్నారు.ఇటీవల కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు స్కామర్లు. పార్శిల్ స్కామ్, ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేర్లతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో అనేక మంది చిక్కుకుని భారీగా నష్టపోయారు. తాజాగా డిజిట‌ల్ అరెస్ట్ స్కామ్ ఎక్కువైపోయింది. ఈ స్కామ్ ఎలా చేస్తారంటే.. ‘హలో! నేను సీబీఐ అధికారిని.. మీకు ఓ పార్శిల్‌ వచ్చింది.. అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయి.. మీపై కేసు నమోదు చేస్తున్నాం.. మీరు కేసు నుంచి బయట పడాలంటే కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది’.. అంటూ మ‌న‌ల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు.

ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో కొత్త కొత్త మోసాలు జరుగుతున్నాయి. డిజిట‌ల్ అరెస్ట్ ప్ర‌కారం కోసం కాల్ చేసిన వారు సీబీఐ, కస్టమ్, ఈడీ అధికారులమని మీతో చెప్పుకుంటారు. ఇలాంటి మోసాలను నమ్మకూడదని కేంద్రం చెబుతుంది. తాజాగా సూచనలు కూడా చేసింది. భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాల కేసులకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పబ్లిక్ అడ్వైజరీ కూడా జారీ చేసింది. సీబీఐ, పోలీస్, కస్టమ్స్, ఈడీ లేదా న్యాయమూర్తులు వంటి చట్టాన్ని అమలు చేసే సంస్థలు వీడియో కాల్‌ల ద్వారా అరెస్టులు చేయవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

digital arrest scams increasing in india

 

డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అని పిలిచే ఈ స్కామ్‌లో నేరస్థులు చట్టపరమైన అధికారులుగా నటించి అనుమానాస్పద వ్యక్తుల నుంచి డబ్బును దోచుకోవడానికి భయాందోళన కలిగిస్తారు. అనుమానాస్పద పార్శిల్ ఆధారంగా బాధితుడు నేరం చేశాడని, ఒత్తిడిని పెంచడానికి వారిని ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు ఒంటరిగా ఉంచడం, చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి బాధితుడిని డబ్బు చెల్లించమని తరచుగా డిమాండ్ చేస్తుంటారు.

మీరు కాలర్ గుర్తింపు గురించి కచ్చితంగా తెలియకుంటే ఫోన్‌లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు.అత్యవసర అభ్యర్థనలపై సందేహాస్పదంగా ఉండండి. స్కామర్‌లు తరచుగా అత్యవసర భావాన్ని క్రియేట్ చేస్తారు. తక్షణ పేమెంట్ల కోసం ఏవైనా అభ్యర్థనలు లేదా చట్టపరమైన బెదిరింపుల పట్ల సందేహాస్పదంగా ఉండండి. యూజర్ల భద్రతను పెంచేందుకు తాము ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సహకరిస్తున్నట్లు వాట్సాప్, స్కైప్ గతంలో పేర్కొన్నాయి. అలాంటి నేరాలను హెల్ప్‌లైన్ నంబర్ 1930కు చెప్పాలని, సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయాలని కేంద్రం చెబుతోంది.

Tags: digital arrest
Previous Post

ఏ రూపంలో ఉన్న గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Next Post

నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా ?

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.