Dining Table : పూర్వకాలం నుంచి మన పెద్దలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ వస్తున్నారు. వాస్తు ప్రకారమే మనం ఎప్పటి నుంచో ఇళ్లను కట్టుకుంటున్నాం. వాస్తు శాస్త్రాన్ని పాటించకపోతే మన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. అది సమస్యలను కలగజేస్తుంది. ఇక ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి అన్న విషయాలను కూడా మనకు వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఎక్కడ పెట్టాల్సిన వస్తువును అక్కడ పెట్టకపోతే వాస్తు దోషం ఏర్పడుతుంది. దీని వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇక వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను కొన్ని చోట్లలో ఉంచితేనే మనకు మంచి జరుగుతుంది.
చాలా మంది ఇండ్లలో డైనింగ్ టేబుల్ ఉంటుంది. అక్కడ కుటుంబం అందరూ కలసి కూర్చుని భోజనం చేస్తారు. అలాంటి చోట్ల పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. నెగెటివ్ ఎనర్జీ గనక ఉంటే అది మనకు సమస్యలను తెచ్చి పెడుతుంది. అందువల్ల డైనింగ్ టేబుల్ విషయంలోనూ మనం వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇక ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే కొందరు తెలిసీ తెలియక తప్పులు చేస్తుంటారు. కొందరు పెట్టకూడని వస్తువులను డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటారు. దీంతో అక్కడంతా నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఫలితంగా అది ఇల్లంతా వ్యాపించి దోషాన్ని కలగజేసి సమస్యలను సృష్టిస్తుంది. వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను డైనింగ్ టేబుల్ పై పెట్టకూడదు. కొందరు తాళం చెవులను తీసుకువచ్చి నేరుగా డైనింగ్ టేబుల్ మీదే పడేస్తారు. అలా చేయకూడదు. తాళం చెవులను డైనింగ్ టేబుల్ మీద పెడితే నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కనుక ఆ పని చేయడం మానుకోవాలి.
ఇక కొందరు మెడిసిన్లను కూడా డైనింగ్ టేబుల్ మీదే పెడుతుంటారు. ఇలా పెడితే వాస్తు ప్రకారం నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. భోజనం చేసిన వెంటనే ట్యాబ్లెట్లను వేసుకోవచ్చని చెప్పి కొందరు ఇలా చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే పుస్తకాలను కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టకూడదు. ఇవి కూడా నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. దీంతోపాటు కత్తులు, పదునైన వస్తువులు, ఆర్టిఫిషియల్ పండ్లు వంటి వాటిని కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టకూడదు. ఇవి నెగెటివ్ ఎనర్జీని కలగజేస్తాయి. ఇలా కొన్ని రకాల వస్తువులను డైనింగ్ టేబుల్ మీద పెట్టడం మానుకోవాలి. దీంతో దోషం పోతుంది. సమస్యల నుంచి బయట పడతారు.