ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యం. వాస్తు నియమాలను పాటించి ఇంటిని నిర్మించుకోవాలి. లేదంటే అన్నీ సమస్యలే వస్తాయి. వాస్తు నియమాలు సరిగ్గా ఉన్నా ఇంట్లో మనం చేసే కొన్ని పనులు లేదా పెట్టే వస్తువులను బట్టి కూడా వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయి. దీంతో మనకు అన్నీ సమస్యలే వస్తుంటాయి. అయితే ఎవరికైనా అన్నీ సమస్యలే వస్తుంటే వాస్తు దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఈ తప్పులను మీరు చేస్తున్నారేమో ఒక్కసారి గమనించండి.
వాస్తు శాస్త్రం ప్రకారం ధనం కలగాలంటే బెడ్రూంలో ఉండే కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే చెప్పుల స్టాండ్ కు కూడా ద్వారం ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇలా ఉంచడం మంచిది. దీని వలన ధనం పెరుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మీ పర్సు లో కొంచెం బియ్యాన్ని ఉంచడం వలన ధనం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రపోవడం మంచిది దీని వలన శాంతి కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రశాంతత ఉండి డబ్బులు రావాలంటే లోహపు చేపని ఉంచండి. నెమలీకలని ఇంట్లో ఉంచడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది డబ్బులు కూడా విపరీతంగా పెరుగుతాయి.