Diabetes : ప్రస్తుతం తరుణంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అస్తవ్యవస్తమైన జీవనవిధానం కారణంతోనే టైప్ 2 డయాబెటిస్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే డయాబెటిస్ సమస్య ఉన్నవారు అన్ని విధాలుగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
షుగర్ సమస్య ఉన్నవారు ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నట్స్‌ను ఎక్కువగా తినాలి. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. వేళకు భోజనం చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
షుగర్ సమస్య ఉన్నవారు కింద తెలిపిన విధంగా పలు ముద్రలను రోజూ వేయాలి. ఒక్కో ముద్రను కనీసం 10 నిమిషాల పాటు వేయాలి. రోజూ ఈ అన్ని ముద్రలను వేయాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ధ్యానం చేసే భంగిమలో పద్మాసనం వేసి కూర్చుని రెండు చేతి వేళ్లతో ఈ ముద్రలను వేయాలి. దీంతో షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఆపాన ముద్ర, లింగ ముద్ర, ప్రాణ ముద్ర, సూర్య ముద్ర, జ్ఞాన ముద్ర.. అని ఈ ముద్రలను రోజూ వేస్తే డయాబెటిస్ నుంచి బయట పడవచ్చు.
ఈ ముద్రలను వేయడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దగ్గు, జలుబు తగ్గిపోతాయి. శరీరంలో ఉండే కఫం తగ్గుతుంది. మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. నాసికా రంధ్రాల్లో ఉండే అడ్డంకులు పోయి శ్వాస సరిగ్గా ఆడుతుంది.