Fenugreek Leaves : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో మెంతి ఆకు ఒకటి. దీన్ని కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ ఆయుర్వేద ప్రకారం మెంతి ఆకులు ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలను కలిగి ఉంటాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. కనుక మెంతి ఆకులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. మెంతి ఆకులను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. షుగర్ సమస్యతో బాధపడుతున్నవారికి మెంతి ఆకులు వరమనే చెప్పాలి. వీటిని రసంలా చేసి ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో రోజూ తాగాలి. 30 రోజుల పాటు ఇలా చేస్తే తప్పక గుణం కనిపిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే బీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2. మెంతి ఆకులను తినడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్ణం నుంచి బయట పడవచ్చు.
3. మెంతి ఆకులను రోజూ తింటే శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది.
4. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మెంతి ఆకులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఆకుల వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపునే ఈ ఆకుల రసం తాగితే ఎంతో మేలు జరుగుతుంది.
5. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించే గుణాలు మెంతి ఆకుల్లో ఉంటాయి. దీని వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.