Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు ఆహారం

Oats Dosa : గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్‌.. వాటితో దోశ‌ల‌ను ఇలా వేసుకోండి..!

Editor by Editor
April 20, 2022
in ఆహారం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Oats Dosa : మ‌న‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి మ‌న‌కు అద్భుత‌మైన పోష‌కాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇంకా ఓట్స్ వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తిన‌డం కొంద‌రికి ఇష్టం ఉండ‌దు. కానీ వీటితో దోశ‌ల‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఇక ఓట్స్ తో దోశ‌ల‌ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Oats Dosa is very healthy to heart make it like this
Oats Dosa

ఓట్స్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఓట్స్ – అర క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీస్పూన్‌, బొంబాయి ర‌వ్వ – పావు క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, అల్లం తురుము – ఒక టీస్పూన్‌, ప‌చ్చి మిర్చి తురుము – 2 టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – మూడు క‌ప్పులు, నూనె – వేయించ‌డానికి స‌రిప‌డా.

ఓట్స్ దోశ త‌యారు చేసే విధానం..

ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. త‌రువాత దానికి బియ్యం పిండి, ర‌వ్వ‌, పెరుగు జోడించి క‌ల‌పాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, అల్లం తురుము, ప‌చ్చి మిర్చి తురుము, కొత్తిమీర తురుము, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు అన్నీ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు నీళ్లు పోసి క‌లిపి 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్ర‌మాన్ని గ‌రిటెతో ర‌వ్వ‌దోశ మాదిరిగానే వేయాలి. బాగా కాలిన త‌రువాత రెండో వైపు కూడా కాల్చి తీసి ఇష్ట‌మైన చ‌ట్నీ లేదా కూర‌తో తినాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఓట్స్‌లోని పోష‌కాల‌న్నీ మ‌న‌కు ల‌భిస్తాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయి.

Tags: Oats Dosa
Previous Post

Mutton : షుగ‌ర్ ఉన్న‌వారు మ‌ట‌న్ తిన‌వ‌చ్చా ?

Next Post

Chickpeas : శ‌న‌గ‌ల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. అమిత‌మైన శ‌క్తి, పోష‌కాలు ల‌భిస్తాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.