Liver : ప్రస్తుత కాలంలో మద్యపానం చేసే అలవాటు ఉన్న వారు చాలా మందే ఉన్నారు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఈ అలవాటు నుండి బయట పడడం లేదు. మద్యాన్ని సేవించకుండా ఉండలేక పోతున్నారు. ఈ అలవాటు కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాలేయం చెడిపోవడం, కుళ్లి పోవడం, కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. కేవలం మద్యపానం ద్వారా మాత్రమే కాకుండా ధూమ పానం వల్ల కూడా కాలేయ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా కామెర్లతో, జ్వరంతో బాధపడుతున్నా కూడా కాలేయం పని తీరు సన్నగిల్లుతుంది.
కాలేయ సమస్యలు వచ్చిన వెంటనే వాటికి తగిన చికిత్సను తీసుకోవాలి. ఒకవేళ ఈ సమస్యలను మనం నిర్లక్ష్యం చేస్తే అవి క్రమేపీ ఎక్కువై కాలేయం మొత్తం చెడిపోయ ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. కాలేయ సమస్యలు తలెత్తిన వెంటనే మనం వాటిని గుర్తించి తగిన మందులను ఉపయోగించాలి. ఆయుర్వేదం ద్వారా మనం కాలేయ సమస్యలను తగ్గించుకోవచ్చు. మన చుట్టూ పరిసరాలలో ఉండే పునర్నవ మొక్కను ఉపయోగించి మనం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలేయ సమస్యలతో బాధపడే వారికి పునర్నవ మొక్క దివ్య ఔషధంగా పని చేస్తుంది. వర్షాకాలంలో ఈ మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తాయి. ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు తెలియక చాలా మంది దీనిని కలుపు మొక్కగా భావిస్తారు.
మన శరీరంలో ఉండే కాలేయాన్ని సంరక్షించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. పునర్నవ మొక్క ఆకులను సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగిన తరువాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల కాలేయ సమస్యలు అన్నీ తగ్గి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా పునర్నవ ఆకుల రసాన్ని తాగడం వల్ల కేవలం కాలేయ సమస్యలే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా పునర్నవ మొక్కన ఉపయోగించి కాలేయ సమస్యలన్నింటినీ నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.