Turmeric Water : మనలో చాలా మంది ఆరోగ్యం కోసం రకరకాల జ్యూస్ లను తాగుతూ ఉంటారు. ఇవి అన్ని ఆరోగ్యాన్ని బాగు చేస్తాయో, పాడు చేస్తాయో తెలియదు కానీ ఈ ఒక్కటి తాగితే మాత్రం ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తాయి. అదేమిటని అందరూ సందేహం వ్యక్తం చేస్తుంటారు. అదేమిటో కాదు మనందరికి తెలిసిందే. అదే పసుపు. భారతీయ సాంప్రదాయంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు ఏ శుభకార్యాన్నయినా పసుపుతోనే ప్రారంభిస్తారు. పసుపును వంటల్లో ఎంతో కాలం నుండి ఉపయోగిస్తూ ఉన్నారు. పసుపు యాంటీ బయాటిక్ గా పని చేస్తుందని మనందరికి తెలిసిందే. అలాగే పసుపు నీటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఇటీవలే కొందరు వైద్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
పసుపు నీళల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పసుపు ఆర్థరైటిస్ లక్షణాలను నివారిస్తుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పసుపు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా పది నెలల పాటు ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు దుంప జాతికి చెందినది. పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. మన దేశంలో పసుపు లేని పసుపు వాడని ఇళ్లు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వంటి వ్యాధుల వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. పసుపు క్రిమిసంహారిణి. శరీరానికి తగిలిన గాయాలకు, పుండ్లకు పసుపును రాస్తే సూక్ష్మ క్రిములు దరి చేరకుండా ఉంటాయి. సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. పసుపు ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. దీనిలోని కర్ కుమిన్ వాపులను తగ్గిస్తుంది. రక్తనాళాలను శుభ్రం చేయడంలో కూడా పసుపు ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకుండా చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పసుపు సహాయపడుతుంది.
క్రమంతప్పకుండా పసుపు నీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను నివారించుకోవచ్చు. జామ ఆకులను పసుపుతో కలిపి రాయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. వేడి పాలల్లో కొద్దిగా పసుపు కలిపి తాగితే కఫం తగ్గుతుంది. వంటల్లో పసుపును వాడడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. మరుగుతున్న నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నొప్పులు, బెణుకులు ఉన్న చోట పసుపు, ఉప్పు, సున్నం కలిపి పట్టు వేయాలి. ఇలా చేయడం వల్ల అవి తగ్గు ముఖం పడతాయి.
పసుపు నీళ్లు రక్తపోటును, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. పసుపు కొమ్మును దంచి ముద్దగా చేసి తలకు రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. మతిమరుపును తగ్గించే గుణం కూడా పసుపుకు ఉంటుంది. పసుపు నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అసిడిటి తగ్గుతుంది. పసుపు నీళ్లు తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి హాని చేసే కణాలను తొలగించడంలో కూడా పసుపు సహాయపడుతుంది. పసుపు నీటిని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కనుక పసుపు నీటిని తప్పకుండా తాగాలని నిపుణులు చెబుతున్నారు.