మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా, జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించ బడాలన్నా, శక్తి కావాలన్నా, పోషణ లభించాలన్నా.. అందుకు పోషకాలు అవసరం అవుతాయి. అవి రెండు రకాలు. స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ను స్థూల పోషకాలు అంటారు. ఇవి రోజూ మనకు ఎక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. ఇక విటమిన్స్, మినరల్స్‌ను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి తక్కువ మొత్తంలోఅ వసరం అవుతాయి. అయితే స్థూల పోషకాల్లో కార్బొహైడ్రేట్లు మనకు శక్తిని అందిస్తే ప్రోటీన్లు శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. అలాగే కొవ్వులు పలు ముఖ్యమైన విటమిన్లు, ఇతర పోషకాలను శరీరం గ్రహించేందుకు సహాయ పడతాయి.
మన శరీరానికి కొవ్వు హాని చేస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ మనకు మేలు చేసే కొవ్వులు కూడా ఉంటాయి. వాటిని నిర్ణీత మోతాదులో తీసుకుంటే శరీరానికి కొవ్వులు లభిస్తాయి. దీంతో శరీరం మనం తినే ఆహారంలో ఉండే విటమిన్లు ఎ, డి, ఇ లను గ్రహిస్తుంది. కనుక మన శరీరానికి కొవ్వులు కూడా అవసరం. అయితే కొందరికి పొట్ట దగ్గర కొవ్వు బాగా పెరిగిపోతుంది. అలాంటి వారు సాల్యుబుల్ ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.
పల్లీలు, బాదంపప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బీన్స్, శనగలు, సోయా బీన్స్, రాజ్మా, నారింజ పండ్లు, అరటి పండ్లు, అంజీర్, క్యారెట్లు, పాలకూర, ఖర్జూరాలు, అవిసె గింజలు, అవకాడోలు, బ్లాక్ బెర్రీలు, యాపిల్స్, పచ్చి బఠానీలు, ఓట్స్, బార్లీ, పప్పు దినుసులు, బ్రొకొలి, క్యాబేజీ, చిలగడ దుంపలు, ఉల్లిపాయలు, తెల్ల బియ్యంలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. వీటిలో నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. విటమిన్లు ఎ, డి, ఇ లు అందుతాయి. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
పైన తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కేవలం పొట్ట దగ్గరి కొవ్వు మాత్రమే కాదు, శరీరంలో ఇతర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించవచ్చు. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, లివర్, ఇతర అవయవాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని తగ్గించాలంటే పైన తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. ఈ క్రమంలో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365