మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత మోతాదులో నీటిని తాగాలన్న సంగతి అందరికీ తెలిసిందే. నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. వేసవిలో అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం బిజీ బిజీగా గడిపేవారు నీటిని తాగడం మరిచిపోతుంటారు. దీంతో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. చర్మం పొడిగా మారుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి వస్తుంది. అయితే కొందరు నీటిని తాగుతున్నా డీహైడ్రేషన్ బారిన పడుతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. కానీ నిజానికి ఒక్కొక్కరి శరీరానికి ఒక్కో రకంగా నీరు అవసరం ఉంటుంది. కొందరికి తక్కువ నీరు సరిపోతుంది. కానీ కొందరు ఎక్కువగా నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే ఎవరైనా సరే తాము నీటిని ఎంత మేర తాగుతున్నారో, తాము తాగుతున్న నీరు తమకు సరిపోతుందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఇలా చేయాలి.
చేతి వేళ్ల వెనుక భాగంలో మధ్య కణుపు వద్ద చర్మాన్ని పైకి లాగి వదలాలి. చర్మం వెంటనే కిందుకు వెళితే మీరు తగినంత నీటిని తాగుతున్నట్లే లెక్క. అదే చర్మం వెంటనే కిందకు వెళ్లకుండా ముడతలు పడినట్లు అయి నెమ్మదిగా రిలాక్స్ అయితే అప్పుడు మీరు తగినంత నీటిని తాగడం లేదని అర్థం చేసుకోవాలి. దీంతో నీటిని ఇంకా ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇలా ఎవరికి వారు ఈ పరీక్ష చేసుకుని నీటిని ఎంత తాగాలో నిర్దారించుకోవచ్చు. నీటిని ఎక్కువగా తాగవచ్చు.
View this post on Instagram
నీటిని తాగకపోతే పలు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. చర్మం పొడిబారుతుంది. కళ్లు పొడిగా మారి దురదలు పెడతాయి. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. అలసట, తలతిరగడం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి. కొందరిలో గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇవన్నీ నీటిని తక్కువగా తాగుతున్నారని చెప్పేందుకు సంకేతాలే. అందువల్ల ఈ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం వహించరాదు. నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇక పైన తెలిపిన నీటి టెస్ట్‌ను న్యూట్రిషనిస్టు పూజా మఖిజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వివరించారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365