Touching Feet : గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తాయి. మరి అవి రాకుండా చూడలేమా..? అంటే.. చూసుకోవచ్చు.. అందుకు నిత్యం వ్యాయామం చేయాలి, సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.
ఇది సరే.. అసలు ఎవరైనా ఒక వ్యక్తి గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నట్టు ఎలా తెలుసుకోవాలి..? అందుకు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా..? అంటే కాదు.. ఎలాంటి లక్షణాలను పరిశీలించకుండా కేవలం సింపుల్‌గా ఈ టెస్ట్ చేస్తే చాలు, దాంతో ఏ వ్యక్తికి అయినా గుండె సమస్య ఉందో లేదో సింపుల్‌గా చెప్పేయవచ్చు. మరి ఆ టెస్ట్ ఏమిటంటే.. నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి. మోకాళ్లను వంచకుండా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకోవాలి. ఇలా విజయవంతంగా చేస్తే గుండె సమస్య లేనట్టే లెక్క. అలా కాకుండా మోకాళ్లను ఎత్తాల్సి వస్తే అప్పుడు మీరు గుండె సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. దీంతో డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ టెస్ట్ నిజంగా గుండె సమస్యను తెలియజేస్తుందా..? అంటే.. అవును.. నిజంగానే చెబుతుంది. ఇది వాస్తు, జ్యోతిష్యంకు సంబంధించింది కాదు, సైన్స్‌కు సంబంధించింది. సైంటిస్టులు పరిశోధనలు చేశాకే దీన్ని ప్రజలకు చెప్పారు. నార్త్ టెక్సాస్‌లో ఉన్న అమెరికన్ ఫిజియలాజికల్ సొసైటీ వారు 20 నుంచి 83 సంవత్సరాల వయస్సు ఉన్న 526 మందిని పరీక్షించారు. వారికి పైన చెప్పిన విధంగా టెస్ట్ చేయమని చెప్పారు. ఆ సమయంలో వారి గుండె పనితీరు తెలుసుకున్నారు. వారు మోకాళ్లను ఎత్తి ముందుకు వంగారా, అలా కాకుండా విజయవంతంగా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకున్నారా.. అనే విషయాలను పరిశీలించారు.
అనంతరం వచ్చిన ఫలితాలను వారు విశ్లేషించారు. దీంతో వారికి అసలు విషయం తెలిసింది. మోకాళ్లను వంచకుండా నేరుగా వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి ఎలాంటి గుండె సమస్య ఉండదని, అలా కాకుండా మోకాళ్లను వంచి ముందుకు వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి గుండె సమస్య ఉంటుందని వారు చెప్పారు. కనుక మీరు కూడా ఇలా చేసి మీకు సమస్య ఉందో లేదో తెలుసుకోండి. సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.