Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Mustard Oil For Hair : ఆవ‌నూనె ఉప‌యోగాలు.. అందులో దీన్ని క‌లిపి రాస్తే చాలు.. జుట్టు గ‌డ్డిలా పెరుగుతూనే ఉంటుంది..!

D by D
June 3, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mustard Oil For Hair : మ‌నకు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో మ‌న ఇంట్లోనే నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వల్ల మ‌నం జుట్టు స‌మ‌స్య‌లన్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో జుట్టు రాల‌డం, జుట్టు తెగ‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి కార‌ణాలేవైన‌ప్ప‌టికి జుట్టు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్రాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే అన్ని ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఫ‌లితం లేక ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు కేవ‌లం రెండే రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ఇంట్లోనే నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వల్ల అంద‌మైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు.

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ నూనెను ఎలా త‌యారు చేసుకోవాలి…వీటిని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నకు కావ‌ల్సిన ఆ రెండు ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక క‌ప్పు ఆవ నూనెను, 4 టీ స్పూన్ల మెంతుల‌న ఉప‌యోగించాల్సి ఉంటుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌డంలో ఆవ నూనె, మెంతులు చ‌క్క‌గా పని చేస్తాయి. జుట్టు కుదుళ్ల‌ను బ‌లంగా మార్చి జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో, ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి త‌ల‌లో దుర‌ద వంటి వాటిని తగ్గించ‌డంలో, జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలోఆవ నూనె, మెంతులు మ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. దీని కోసం ముందుగా మెంతుల‌ను పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకుని అందులో మెంతుల పొడి వేసి క‌ల‌పాలి.

Mustard Oil For Hair how to use this for better results
Mustard Oil For Hair

త‌రువాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డ‌బుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక నీటి నుండి గిన్నెను బ‌య‌ట‌కు తీసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తాజాగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకోవ‌చ్చు లేదా ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని నిల్వ చేసుకోవ‌చ్చు. ఇలాత‌యారు చేసుకున్న నూనెను త‌గిన మొత్తంలో తీసుకుని జుట్టు కుదుళ్ల నుండి చివరి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Tags: Mustard Oil For Hair
Previous Post

Putnalu : నల్ల శ‌నగలతో ఇలా 2 నిమిషాల్లో పుట్నాలు చేయ‌వ‌చ్చు.. ఎంతో సుల‌భం..!

Next Post

Carrot Kalakand : క్యారెట్లతో ఎంతో రుచిగా ఉండే కలాకంద్‌ తయారీ.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.