Salt And Sugar : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బుల బారిన పడడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు అని మనందరికి తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడే వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నిపుణులు జరిపిన తాజా అధ్యయనాల ప్రకారం గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం పంచదార అని వారు చెబుతున్నారు.
ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో రక్తపోటు తగ్గినప్పటికి అది తక్కువ మోతాదులో మాత్రమే తగ్గుతుంది. అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో రక్తపోటు పెరుగుతుంది. కేవలం రక్తపోటు సమస్యే కాకుండా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అదే విధంగా పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం, మధుమేహంతో పాటు అథెరోస్ల్కెరోసిస్ కు కారణమవుతుంది. అలాగే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అది క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది. కనుక మన గుండె ఆరోగ్యంతో పాటు మన శరీర ఆరోగ్యం మెరుగుపడాలన్నా మనం ఉప్పును, పంచదారను తక్కువగా తీసుకోవాలి. వంటల్లో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
తాజా కూరగాయలు, మాంసంతో మాత్రమే వంటలు వండాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు వాడకం తగ్గుతుంది. అలాగే ఫ్రూట్ జ్యూస్ లో పంచదార వాడకాన్ని తగ్గించాలి. పంచదారకు బదులుగా తేనె, ఖర్జూర పండ్లను ఉపయోగించాలి. టీ, కాఫీలల్లో పంచదారను ఎక్కువగా వేసుకోకూడదు. చాక్లెట్స్, కేక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా తాజా పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా పంచదారను, ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.