Water Apple For Diabetes : మనం రకరకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో వాటర్ యాపిల్ కూడా ఒకటి. వీటినే రోజ్ యాపిల్, వాక్స్ యాపిల్ అని కూడా అంటారు. ఈ పండ్లు మనకు ఎక్కువగా డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో లభిస్తాయి. సూపర్ మార్కెట్ లలో, రోడ్ల పక్కన బండ్ల మీద ఈ పండ్లు మనకు విరివిరిగా లభిస్తాయి. అలాగే ఈ పండ్ల చెట్టును కూడా మనం సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో పండే కొద్దిగా ఎర్రగా మారతాయి. అలాగే ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ వాటర్ యాపిల్స్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయని వారు చెబుతున్నారు.
షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ పండ్లు అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ వాటర్ యాపిల్స్ కు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గొప్ప గుణం ఉంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఐసో మెరిక్ ప్లేవనోన్, చాల్ కోన్ అనే రెండు రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతున్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఈవిధంగా షుగర్ తో బాధపడే వారు ఈ వాటర్ యాపిల్స్ ను తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఈ పండ్లను తినడం వల్ల మనం అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఈ పండ్లను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వాటర్ యాపిల్స్ ను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా వాటర్ యాపిల్స్ మనకు ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని వీటిని తప్పకుండా ఆహారంగా భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.