Mixed Vegetable Upma : మిక్డ్స్ వెజిటేబుల్ ఉప్మా.. కూరగాయ ముక్కలు వేసి చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఈ ఉప్మా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉప్మాను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఉప్మా అంటే ఇష్టంలేని వారు కూడా ఈ ఉప్మాను ఇష్టంగా తింటారు. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మాను తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ వెజిటేబుల్ ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన బంగాళాదుంప – పెద్దది ఒకటి, తరిగిన క్యారెట్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన క్యాప్సికం – 1, తరిగిన టమాట – 1, కరివేపాకు -ఒక రెమ్మ, నీళ్లు – మూడున్నర కప్పులు, నెయ్యి – 2 టీ స్పూన్స్.
మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఉప్మాను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు వేసి మూత పెట్టి వేయించాలి. క్యారెట్, బంగాళాదుంప వేగిన తరువాత క్యాప్సికం, టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత ఉప్మా వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఉప్మా మెత్తబడే వరకు ఉడికించాలి. ఉప్మా ఉడికిన తరువాత నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్డ్స్ వెజిటేబుల్ ఉప్మా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.