Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Masala Chicken Curry : మ‌సాలా పెట్టి చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
November 25, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Masala Chicken Curry : చికెన్ గ్రేవీ క‌ర్రీ.. చికెన్ తో కింద చెప్పిన విధంగా చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే చికెన్ క‌ర్రీ కంటే ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ క‌ర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే చికెన్ క‌ర్రీ కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ గ్రేవీ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర‌- ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్క‌లు – ముప్పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్, ట‌మాట ఫ్యూరీ – పావు క‌ప్పు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, తరిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Masala Chicken Curry recipe very tasty when you make like this
Masala Chicken Curry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 4, అనాస పువ్వ – 1, బిర్యానీ ఆకు – చి్న‌ది ఒక‌టి, ధ‌నియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, గ‌స‌గసాలు – అర టీ స్పూన్, జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్.

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అరకిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.

చికెన్ గ్రేవీ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, కారం, ప‌సుపు, నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిని అర‌గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత జార్ లో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ, పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

Tags: Masala Chicken Curry
Previous Post

Kakarakaya Uragaya : కాక‌ర‌కాయ ఊర‌గాయ త‌యారీ ఇలా.. అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Next Post

Kallu : క‌ల్లు తాగితే ఏం జ‌రుగుతుంది..? ఎవ‌రికీ తెలియ‌ని టాప్ సీక్రెట్ ఇది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.