Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

All In One Chicken Curry : ఆలిన్ వ‌న్ చికెన్ క‌ర్రీ.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది.. ఇలా చేయాలి..!

D by D
December 22, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

All In One Chicken Curry : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, పూరీ, బ‌గారా అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చిక్క‌టి గ్రేవీతో ఈ క‌ర్రీ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎక్కువ గ్రేవీతో ఎందులోకైనా తినే ఈ చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 4, బిర్యానీ ఆకు – 1, జాప‌త్రి – కొద్దిగా, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, చిన్న‌గా త‌రిగిన ట‌మాట- 1, ధ‌నియాల పొడి – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, జీడిప‌ప్పు – 10 నుండి 15, నీళ్లు – ఒక గ్లాస్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, క‌సూరిమెంతి – అర టీ స్పూన్.

All In One Chicken Curry recipe better tastes with rice and chapati
All In One Chicken Curry

చికెన్ కర్రీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కారం, ఉప్పు, ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత జీడిపప్పును పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడిచేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై చికెన్ లోని నీరు అంతా పోయి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. ఈ చికెన్ క‌ర్రీని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: All In One Chicken Curry
Previous Post

Veg Khuska Pulao : వెజ్ ఖుస్కా పులావ్‌ను ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Next Post

Calcium Tablets : కాల్షియం ట్యాబ్లెట్లను వేసుకుంటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా..?

Related Posts

information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

July 4, 2025
మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.