Depression : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నిరాశతో బాధపడుతున్నారు. మనల్ని వేధించే మానసికపరమైన సమస్యలల్లో ఇది కూడా ఒకటి. నిరాశ నుండి మనం వీలైనంత త్వరగా బయట పడాలి. లేదంటే ఈ సమస్ మరింత తీవ్రమయ్యి మానసికంగా మరింతగా కుంగిపోతారు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. కనుక నిరాశ, నిసృహల నుండి వీలైనంత త్వరగా బయటపడడం చాలా అవసరం. నిరాశ వంటి మానసికపరమైన సమస్యలతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే వాటిని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిరాశ వంటి మానసికపరమైన సమస్యతో బాధపడే వారు ఇతరుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం మానుకోవాలి. ఈ సమస్య నుండి బయటపడాలంటే ముందుగా అందరితో కలిసి ఉండాలి.
సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండాలి. ప్రతికూల ఆలోచనల నుండి బయటపడాలి. మీకు ఉన్న బలాలపై దృష్టి పెట్టాలి. నిరాశ వంటి మానసికపరమైన సమస్య బారిన పడడానికి కారణం నిద్రలేమి కూడా ఒకటి. కనుక దినచర్యను మార్చుకోవాలి. రోజూ 7 నుండి 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలాగే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను, తృణ ధాన్యాలను తీసుకోవాలి. అలాగే నిరాశ వంటి సమస్యలతో బాధపడే వారు ఆల్కహాల్ ను తీసుకోవడం మానేయాలి. ఆల్కహాల్ మానసిక స్థితిని మరింతగా దిగజారుస్తుంది. కనుక ఆల్కాహాల్ కు దూరంగా ఉండడం మంచిది. అదే విధంగా రోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీకు నచ్చిన వ్యాయామాన్ని చేయడం వల్ల మనలో చాలా మార్పు వస్తుంది.
అలాగే మనకు నచ్చిన, ఆనందాన్ని ఇచ్చే పనులను చేయాలి.చదవడం, పాటలు వినడం, ప్రకృతిలో సమయం గడపడం వంటివి చేయాలి. దీంతో మానసికంగా ఆరోగ్యంగా తయారవుతారు. అలాగే ఎల్లప్పుడూ ప్రతికూల ఆలోచనల గురించి ఆలోచించకండి. ప్రస్తుత క్షణం మీద దృష్టిని పెట్టాలి. ధ్యానంతో పాటు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. అదే విధంగా ఎక్కువ సమయం సెల్ ఫోన్ లతో గడపకూడదు. సెల్ ఫోన్ చూడడం వల్ల ఒంటరితనం, అసమర్థత, నిరాశ వంటి భావాలు మరింత ఎక్కువగా అవుతాయి. కనుక కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయాలి. నిరాశతో బాధపడే వారు ఇతరులల్లో కూడా లోపాలు ఉంటాయని గుర్తించాలి. చిన్న చిన్న విజయాలను కూడా పెద్దగా జరుపుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. నిరాశ నుండి బయటపడడం చాలా కష్టమనే చెప్పాలి. వీటితో పాటుగా మానసిక నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఈచిట్కాలను పాటించడం వల్ల నిరాశ నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.