Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dhaba Style Egg Keema Curry : ధాబా స్టైల్‌లో ఎగ్ కీమా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లో టేస్టీగా ఉంటుంది..!

D by D
February 26, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dhaba Style Egg Keema Curry : మ‌న‌కు ధాబాల్ల‌లో ల‌భించే ఎగ్ వెరైటీల‌ల్లో ఎగ్ కీమా ఒక‌టి. ఎగ్ కీమా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఎగ్ కీమాను ధాబా స్టైల్ లో మ‌నం కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఎగ్ కీమాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా ఈ ఎగ్ కీమాను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే ధాబా స్టైల్ ఎగ్ కీమాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ ఎగ్ కీమా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, బిర్యానీ ఆకు – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, వెల్లుల్లి త‌రుగు – ఒక టీస్పూన్, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీస్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరిమెంతి – అర టీ స్పూన్, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, కోడిగుడ్డు – 1, ఉడికించిన కోడిగుడ్లు – 3, నీళ్లు – త‌గిన‌న్ని, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dhaba Style Egg Keema Curry recipe make in this method
Dhaba Style Egg Keema Curry

ధాబా స్టైల్ ఎగ్ కీమా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. ఇవి స‌గానికి పైగా వేగిన త‌రువాత వెల్లుల్లి త‌రుగు, అల్లం త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కారం, ధ‌నియాలు పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరిమెంతి వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ వేడ‌య్యాక గుడ్డును ప‌గ‌ల‌కొట్టి వేసుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి కూడా వేసి వేయించాలి.

గుడ్డు వేగిన త‌రువాత చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌ను తురిమి వేసుకోవాలి. వీటిని కొద్దిగా రంగు మారు వర‌కు వేయించిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న కూర వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్నినీళ్లు పోసుకుని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ కీమా త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో దీనిని తింటే మ‌రింత రుచిగా ఉంటుంది.

Tags: Dhaba Style Egg Keema Curry
Previous Post

Bananas : అర‌టి పండును అస‌లు ఎలా తినాలి..? ఈ విష‌యాలను తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Next Post

Thippatheega : దీన్ని నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చా..? ఇందులో ఉన్న ప‌వ‌ర్ మీకు అందాలంటే..?

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.