Fasting In Summer : వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది ఈ సీజన్‌కు తగిన డైట్‌ను పాటిస్తుంటారు. ముఖ్యంగా పానీయాలను అధికంగా తాగుతుంటారు. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో ఉపవాసం చేసేవారు కూడా చాలా మందే ఉంటారు. దేవుడి కోసం చేసినా, బరువు తగ్గడం కోసం లేదా ఆరోగ్యం కోసం చేసినా ఈ సీజన్‌లో ఉపవాసం ఉంటున్నారంటే తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని తప్పకుండా పాటించాలి. లేదంటే ఈ సీజన్‌లో ఇష్టం వచ్చినట్లు ఉపవాసం చేస్తే అది ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంటుంది. మరి ఉపవాసం విషయంలో పాటించాల్సిన ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వేసవిలో ఉపవాసం చేసేవారు తప్పనిసరిగా ద్రవాలను తీసుకోవాలి. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో శరీరంలోని ద్రవాలన్నీ పోతాయి. ఫలితంగా ఎండదెబ్బ బారిన పడతారు. కనుక ఉపవాసం చేసే సమయంలో తప్పనిసరిగా ద్రవాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వేడి చేయకుండా శరీరం చల్లగా ఉంటుంది. అలాగే ఎండదెబ్బ తాకదు. ఇక ఈ సీజన్‌లో ఉపవాసం ఉంటే తప్పనిసరిగా పండ్లను తీసుకోవాలి. ఇవి శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూస్తాయి. అలాగే నీరసం రాకుండా ఉంటుంది. ఎండ వేడికి గురి కాకుండా ఉంటారు.
వేసవిలో ఉపవాసం చేసేవారు అన్ని పోషకాలు రోజూ అందేలా చూసుకోవాలి. లేదంటే అనారోగ్యం బారిన పడతారు. అలాగే ఉపవాసం ఉండే సమయంలో తగినంత నిద్ర కూడా అవసరమే. నిద్ర పోకపోతే నీరసం వస్తుంది, బలహీనంగా మారుతారు. కనుక నిద్ర తప్పనిసరి. ఇక వేసవిలో ఉపవాసం చేస్తే కఠినంగా చేయకూడదు. ద్రవాలు లేదా పండ్లతో ఉపవాసం చేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుంది.