మనం రోజూ వండుకునే బంగాళాదుంపలనే ఆలుగడ్డలు అని కొందరు పిలుస్తారు. ఇంగ్లిష్‌లో పొటాటో అంటారు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన వారు ఆలుగడ్డలను తమ ఆహారంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆలుగడ్డల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి.
ఆలుగడ్డల్లో విటమిన్లు ఎ, బి, ప్రోటీన్లు, ఫాస్ఫరస్, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, విటమిన్ సిలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి.
మలబద్దకం సమస్య ఉన్నవారు ఆలుగడ్డలను తింటుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం రెండు లేదా మూడు టీస్పూన్ల ఆలుగడ్డల రసాన్ని తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఆలుగడ్డల నుంచి రసం తీసి దాన్ని చర్మానికి రాసుకుంటుండాలి. చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి, చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది.
100 గ్రాముల పచ్చి బంగాళా దుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. దాన్ని కాలిన భాగంపై రాసి కట్టు కడుతుండాలి. దీంతో గాయాలు తగ్గుతాయి.
ఆలుగడ్డలను ఒక సాన రాయి మీద రుద్దితే మెత్తని పేస్టు వస్తుంది. దీన్ని కళ్లకు కాటుకలా పెట్టుకుంటుండాలి. కళ్ల కలక తగ్గుతుంది.
ఆలుగడ్డలను తరచూ ఆహారంలో తీసుకుంటుండడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
ఆలుగడ్డలను నిప్పుల మీద వేసి వేడి చేసి పై తొక్కను తొలగించిన కొద్దిగా ఉప్పు కలిపి ఆహారంగా తీసుకుంటుండాలి. శరీరం దృఢంగా మారుతుంది.
పచ్చి బంగాళాదుంపలను మెత్తగా రుబ్బి గుడ్డలో వేసి పిండి రసం తీయాలి. దాన్ని ఒక కప్పు మోతాదులో రెండు పూటలా తాగుతుండాలి. దీంతో అసిడిటీ, కడుపులో మంట, గ్యాస్ తగ్గుతాయి.
Trending News :
► ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!
► బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే.. బ్రౌన్ రైస్ వల్ల కలిగే లాభాలు ఇవిగో..!
► వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా ? అయితే జీలకర్ర నీళ్లను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొందవచ్చు..!
► శరీరంలో రక్త సరఫరా మెరుగు పడాలంటే.. వీటిని తీసుకోవాలి..!