Shirdi Sai Baba : బాబా భక్తులు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా షిరిడీకి వెళ్లి బాబాను దర్శించుకోవాలని కోరుకుంటారు. షిరిడీకి వెళ్లి బాబాకు పూజలు చేయాలని, బాబా సమాధిని తాకాలని, బాబాగా గారి వస్త్రాలను తెచ్చుకోవాలని, బాబా గారు నడిచినటువంటి షిరిడీని చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే కొందరు అనుకోకుండానే షిరిడీని వెళ్తూ ఉంటారు. కొందరు ఎంత ప్రయత్నించినా కూడా షిరిడీని వెళ్లలేరు. షిరిడీకి వెళ్లాలంటే మనకు బాబా గారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. బాబా గారి అనుగ్రహం లేనిదే మనం షిరిడీకి వెళ్లలేము. బాబా గారి దర్శనం చేసుకోలేము.
షిరిడీకి వెళ్లి బాబా గారి దర్శనం చేసుకోవాలని మనం బాబాను కనుక పూజిస్తే బాబా మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. అయితే షిరిడీకి రమ్మని తన దర్శనం చేసుకోమని బాబా గారు మనకు సంకేతాలను పంపుతారని పండితులు చెబుతున్నారు. పని ఒత్తిడిలో పడి, బాధలు, కష్టాల కారణంగా కొన్ని సార్లు మనం ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తాము. ఆ సంకేతాలు ఒక్కొసారి మనకు అర్థం కావు. షిరిడీకి వెళ్లడానికి బాబా గారు మనకు పంపించే సంకేతాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన బందువులు కానీ , స్నేహితులు కానీ మేము బాబా గారి దర్శనానికి షిరిడీ వెళ్తున్నాము మీరు కూడా వస్తారా అని మనకు ప్రత్యేకంగా ఫోన్ చేసిమరీ అడుగుతారు. ఇదే బాబా గారు తన దర్శనార్థం మనకు పంపించే మొదటి సంకేతం.
అలాగే బాబా గారి షిరిడీ హారతి మనకు అప్రయత్నంగానే వినిపిస్తూ ఉంటుంది. ఈ హారతి ఎక్కడ నుండి వినిపిస్తుందో కూడా తెలియదు. ఇలా కనుక మనరకు హారతి వినిపిస్తే బాబా గారు మనల్ని షిరిడీకి రమ్మనారని గుర్తించాలి. అలాగే బాబా గారి విభూది కానీ, ప్రసాదం కానీ, ఫోటో కానీ, విగ్రహం కానీ గురువారం నాడు మన ఇంటికి చేరిందంటే అది బాబా గారు తనని దర్శించుకోమని పంపే సంకేతంగా భావించాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడు మనంతట మనమే షిరిడీ దర్శనానికి వెళ్తాము.కానీ కష్టాల్లో,బాధల్లో ఉన్నప్పుడు బాబా గారు ఈ సంకేతాలను మనకు పంపుతారు. బాబా గారి దర్శనం చేసుకుంటే కష్టాలు, బాధలు తొలగిపోతాయని దీని అర్థం. అలాగే బాబా గారు మనకు కలలో దర్శనమిస్తారు.
మన చెయ్యి పట్టుకుని బాబా గారు మనల్ని షిరిడీ తీసుకెళ్తున్నట్టుగా, అలాగే ఏదోఒక రూపంలో బాబా గారి దర్శనం మనకు కలుగుతుంది. ఇలా బాబా గారు మనకు కలలో కనిపిస్తే కనుక మనకు షిరిడీకి బాబాగారు మనకు పంపించే సంకేతంగా భావించాలి. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే మనం షిరిడీ వెళ్లి బాబా గారి దర్శనం చేసుకోవాలి. అయితే అప్పు చేసి మాత్రం అస్సలు షిరిడీ వెళ్లకూడదని డబ్బులతో ఇబ్బంది పడే వారికి డబ్బులు ఎలా సమకూర్చాలో బాబాకు తెలుసనని అంతేకానీ అప్పు చేసి షిరిడీకి వెళ్లాలనే నిర్ణయం సరైనది కాదని బాబా గారు సచరిత్రలో తెలిపారని పండితులు చెబుతున్నారు.