చాలామంది అన్నాన్ని కూడా మానేసి చపాతీలను తింటూ ఉంటారు. చపాతీలు తీసుకునేటప్పుడు రోజుకి ఎన్ని తీసుకోవచ్చు..? ఏమైనా నెంబర్ ఉంటుందా..? ఇన్నే తినాలని ఏమైనా రూల్ ఉందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. అన్నానికి బదులుగా చపాతీలు తీసుకునే వాళ్ళు రోజూ ఎన్ని చపాతీలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు..?, ఎన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు కలుగవు అనే విషయానికి వచ్చేస్తే.. ఎప్పుడూ కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. ఆహారం అధికంగా తీసుకుంటే కూడా సమస్యలు వస్తాయి.
పోషకాహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఐదు నుంచి ఏడు చపాతీలను తీసుకుంటే ఏం పర్వాలేదు. అంతకుమించి తీసుకోవడం మంచిది కాదు. మీ జీతాన్ని బట్టి మీరు తినే ఆహారాన్ని చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ జీతం వస్తున్నట్లయితే మల్టీ గ్రైన్ ఉన్న పిండిని కొనుగోలు చేసి మీరు తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
అదే తక్కువ జీతం కలిగిన వాళ్ళు సాధారణ పిండిని ఉపయోగించవచ్చు. అలాగే, మీరు మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీని బట్టి కూడా నిర్ణయించుకోండి. ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళు ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. చపాతీతో పాటుగా మీరు కూరగాయలు, ప్రోటీన్, పండ్లు ఇటువంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ చపాతీలను తీసుకోవడం వలన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. వీటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని చపాతీలను ఎన్ని తీసుకోవాలని అనేది నిర్ణయం తీసుకోండి.