సినీ ఇండస్ట్రీలో ప్రతి సినిమాకు ఒక వేరియేషన్ ఉంటుంది. దర్శకులు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎలా అలరిస్తే బాగుంటుంది.. అనే ఆలోచనతో సినిమాలను చిత్రీకరిస్తుంటారు. ప్రేక్షకులు ఎక్కువగా అలరించే చిత్రాలలో సోషియో ఫాంటసీ మూవీస్ ముందు ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి కథలు మన ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. సోషియో ఫాంటసీ చిత్రాల్లో ఎక్కువగా ఆకర్షించబడే నేపథ్యంలో నిర్మించబడినవి టైమ్ ట్రావెల్ సినిమాలు. వీటిని నిర్మించడానికి కూడా ఎంతో భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. అంతేకాకుండా స్క్రిప్ట్ కూడా చాలా క్లియర్ గా ఉంటేనే సినిమా సక్సెస్ అందుకుంటుంది. ఇలా భారీ బడ్జెట్ తో నిర్మించబడి, ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైం ట్రావెల్ మూవీస్ ఏమిటో ఓ లుక్కేద్దామా..!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ఆదిత్య 369. 1991 లో టైం ట్రావెల్ నేపద్యంలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గాను సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రస్తుత కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయలు కాలంలోకి టైం ట్రావెల్ ద్వారా వెళ్లి, ముందు తరం ఎలా ఉండబోతుందో అని చూపించారు. అప్పట్లో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఘనవిజయాన్ని సాధించింది.
2008లో హార్మాన్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ 2050. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్తో టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఒక మోస్తరు మార్కులతో సరిపెట్టుకుంది.
సూర్య, సమంత జంటగా నటించిన చిత్రం 24. ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. త్రిపాత్రాభినయంతో సూర్య ఎంతగానో అలరించారు. కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 24 చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అక్షయ్ కుమార్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన చిత్రం కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ రిప్లై చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది.
సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కూడా సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇక బింబిసార కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.