ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ వలన బాధపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమస్యకి కారణం అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం, స్మోకింగ్, ఒత్తిడికి ఎక్కువగా గురికావడం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తినడం, ఎక్కువసేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, జన్యుపరమైన కారణాల వలన అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆహారం, జీవనశైలిలో మార్పుల ద్వారా దానిని తగ్గించొచ్చు. అధిక బరువు రక్తపోటును పెంచుతుంది. అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి. అందుకే బరువును తగ్గండి. బరువు తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ఎన్నో ప్రాణాంతక రోగాల ముప్పు కూడా తప్పుతుంది. కేవలం ఐదు రోజులపాటు క్రమం తప్పకుండా సైకలింగ్, వాకింగ్, స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.
ఇలా చేయడం వల్ల శరీర కదలిక కారణంగా రక్తప్రసరణ, కొవ్వు తగ్గించుకోవచ్చు. అధికరక్తపోటు ఉన్నవారు ఎల్లప్పుడు శాంతిగా ఉండాలి. ధూమపానం. మద్యం అలవాటుంటే వెంటనే మానేయండి. ఎందుకంటే ఇది కూడా మీ రక్తపోటును పెంచుతుంది. వారానికి రెండు మూడు సార్లు చేపలు తినడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి తగ్గితే ఆటోమెటిక్ గా మీ రక్తపోటు స్థాయిలు కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు పేషెంట్లు వీలైనంత ఎక్కువగా వెజిటేబుల్ జ్యూస్ ను తాగాలి. ముఖ్యంగా వీట్ గ్రాస్ రసం. ఇది వీరి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని తినాలి. ప్రతిరోజూ సెలెరీ తాజా కాండాలను తిన్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది.
అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి ఎల్-థియనిన్ తో పాటుగా మెగ్నీషియం సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఇవి మీ రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. వీటితొ పాటు ధ్యానం, దీర్ఘ శ్వాస, మసాజ్ ద్వారా కండరాల సడలింపు. యోగా, ప్రశాంతమైన నిద్ర కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.బయట లభించే సోడా, కూల్ డ్రింక్స్‌ను కూడా తీసుకోవడం మంచిది కాదు. స్వీట్లను కూడా తగ్గించడం మంచిది. అధికంగా చక్కెర తినడం వల్ల డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యతో తీవ్ర ఇబ్బందితో బాధపడుతుంటే వెంటనే ఆరోగ్యనిపుణుల సలహ తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లప్పుడు వైద్యుడు ఇచ్చిన మందులను టైమ్‌కు వేసుకోవడం మంచిది.