Vignesh Shivan : స్టార్ కపుల్ విగ్నేష్ శివన్, నయనతార ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వీరి వివాహం మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్‌లో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరి వివాహ వేడుకకు షారూఖ్ ఖాన్, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఇక నయనతార ఎంతో కాలం నుంచి లేడీ సూపర్ స్టార్‌గా కొనసాగుతుండగా.. అటు విగ్నేష్ శివన్ కూడా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరి ఆస్తుల విలువ గురించి బాలీవుడ్ మీడియా అనేక కథనాలను ప్రచురిస్తోంది. ఆ కథనాల ప్రకారం.. విగ్నేష్ శివన్, నయనతారల ఉమ్మడి ఆస్తి విలువ రూ.270 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
నయనతార హీరోయిన్‌గా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. కనుక సహజంగానే ఆమె సంపద ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే నయనతారకు ఆస్తులు భారీగానే ఉన్నట్లు సమాచారం. ఈమెకు ఒక ప్రైవేట్ జెట్‌తోపాటు పలు బీఎండబ్ల్యూ కార్లు, మెర్సిడిస్ బెంజ్ కార్లు ఉన్నాయట. అఆగే చెన్నైలో పలు కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమె ఆస్తి విలువే రూ.170 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఇక దర్శకుడు విగ్నేష్ శివన్ ఆస్తి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. విగ్నేష్ శివన్.. నయనతారలా అంత పాపులర్ కాదు. కానీ ఆస్తి మాత్రం బాగానే ఉందట. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి ఆస్తి కలిపి రూ.270 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా నయనతార బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ మూవీ జవాన్‌లో నటించింది. దీనికి తమిళ దర్శకుడు అట్లీ దర్వకత్వం వహించారు. ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.