Hair Oil For Hair Growth : ఆడవాళ్లు అందమైన కురులని పొందడానికి చూస్తారు. అందమైన కురులు ఉంటే, అందం కూడా పెరుగుతుంది. చూడడానికి బాగా అందంగా, చక్కగా కనబడుతుంటారు. మీరు కూడా, అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? దృఢంగా మీ కురులని మార్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. సరైన జీవన విధానాన్ని పాటిస్తే, ఆరోగ్యంతో పాటుగా జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి. వాతావరణం లో కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. అలానే, ఆహారపు అలవాట్లు కూడా ఎంతో మారిపోయాయి.
సరైన పోషకాలను తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన పోషకాలు లేకపోతే జుట్టు రాలిపోతుంది. ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళకి కూడా, జుట్టు బాగా రాలిపోతుంది. అయితే, ఇలా చేసినట్లయితే, మీ జుట్టుని ఒత్తుగా, దృఢంగా మార్చుకోవచ్చు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వలన లాభాలు కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అనేక సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి.
అలాంటప్పుడు, ఈ ఇంటి చిట్కాలని ప్రయత్నం చేస్తేనే మంచిది. నాచురల్ పద్ధతులతో, మనం జుట్టుని పెంచుకోవచ్చు. దీనికోసం ముందు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుని, పావు లీటర్ దాకా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ మెంతులు, మూడు తమలపాకులు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. నూనె గోల్డ్ కలర్ లోకి వచ్చేవరకు మరిగించుకోవాలి.
ఇప్పుడు గోల్డ్ కలర్ లోకి వచ్చాక తీసేసి, పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత, ఒక గాజు సీసా తీసుకొని, అందులో ఈ నూనెని వడకట్టుకుని పోసుకోవాలి.. ఆయిల్ ని ఎప్పుడంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు. ఈ ఆయిల్ మీరు వాడినట్లయితే, కొన్ని రోజుల్లోనే మార్పు కనపడుతుంది. జుట్టు ఒత్తుగా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జుట్టు బాగా ఎదగడానికి, ఈ నూనె మీకు సహాయం చేస్తుంది. ఒత్తుగా, దృఢంగా మారుతుంది.