అధిక బరువు సమస్య అనేది ప్రస్తుత తరుణంలో ఇబ్బందులను కలగజేస్తోంది. దీని వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారు. అధిక బరువు వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయి. అందువల్ల బరువును తగ్గించుకోవాలని చూస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. దాని వెనుక ఉండే కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక బరువు తగ్గాలని చెప్పి కొందరు మరీ తక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చేయరాదు. రోజూ తీసుకునేంత మోతాదులోనే ఆహారాలను తినాలి. కానీ వ్యాయామం ఎక్కువగా చేయాలి. ఆహారాల్లో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఫైబర్ ఎక్కువగా తినేలా చూసుకోవాలి. దీంతో బరువు తగ్గుతారు.
2. కొందరు కాస్తంత బరువు తగ్గగానే కొన్ని రోజుల పాటు డైట్, ఎక్సర్‌సైజ్ మానేస్తారు. మళ్లీ బరువు పెరగ్గానే డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తారు. ఇలా చేయకూడదు. డైట్, వ్యాయామం అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. మధ్యలో మానేయడం వల్ల మళ్లీ వ్యాయామం మొదలు పెడితే బరువు తగ్గరు. అందువల్ల డైట్ పాటించడం, వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో వాటిని ఎప్పటికీ అలాగే కొనసాగించడం అంత ముఖ్యం. మధ్యలో మానేయరాదు. మానేస్తే బరువు తగ్గలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
3. వ్యాయామం చేసేవారు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటుంటారు. కానీ బరువు తగ్గాలంటే వాటిని తక్కువగా తినాలి. ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని చెప్పేవారు, తాము రోజూ తినే ఆహారంలో ఎన్ని కార్బొహైడ్రేట్లు ఉంటున్నాయి, ఎన్ని ప్రోటీన్లు, ఎంత ఫైబర్‌ను తింటున్నాం.. అనే విషయాలను చెక్ చేసుకోవాలి. కార్బొహైడ్రేట్లను తక్కువగా, ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. దీంతో బరువు తేలిగ్గా తగ్గుతారు.
4. కొందరు బరువు తగ్గడం కోసం మార్కెట్‌లో ఉండే రకరకాల వెయిట్ లాస్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అవి అందరికీ పనిచేయవు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొందరు బరువు తగ్గకపోగా పెరుగుతారు. కనుక వాటిని వాడరాదు. అందుకు బదులుగా సహజ సిద్ధమైన ఆహారాలను వాడాలి. బరువును తగ్గించే పదార్థాలను తీసుకోవాలి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదు.. అని ఫిర్యాదు చేసేవారు పైన చెప్పిన విధంగా మార్పులు చేసుకుంటే కచ్చితంగా బరువు తగ్గుతారు. చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది.