Figs : వేసవి కాలంలో మనకు సహజంగానే వివిధ రకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో అంజీర్ పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు అన్ సీజన్‌లో కేవలం డ్రై ఫ్రూట్స్ రూపంలో మాత్రమే లభిస్తాయి. కానీ వేసవిలో అయితే ఈ పండ్లను మనం నేరుగా తినవచ్చు. వీటి లోపలి భాగాన్ని చూస్తే ఎవరికీ తినాలని అనిపించదు. కానీ వీటిని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మాత్రం వీటిని తినకుండా విడిచిపెట్టరు. అంజీర్ పండ్లతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సీజన్‌లో మనం వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అంజీర్ పండ్లతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఈ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇది హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే పొటాషియం నాడీ మండల వ్యవస్థ పనితీరును సైతం మెరుగు పరుస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అంజీర్ పండ్లలో విటమిన్ సి, ఇ, ఎ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు రావు. ఇలా అంజీర్ పండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ఈ సీజన్‌లో ఇవి మనకు అధికంగా లభిస్తాయి. కనుక ఈ పండ్లను విడిచిపెట్టకుండా తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.