Kidney Stones : కిడ్నీ స్టోన్ల సమస్యతో ప్రస్తుతం చాలా మంది బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. నీళ్లను తక్కువగా తాగడంతోపాటు వంశపారంపర్యంగా కూడా ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కిడ్నీ స్టోన్లను కరిగించడంలో కొండ పిండి ఆకు అద్బుతంగా పనిచేస్తుంది. ఈ మొక్కకు చెందిన పొడిని తయారు చేసి దాన్ని రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
కొండ పిండి ఆకు మనకు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. గడ్డి బాగా పెరిగే చోట ఉంటుంది. ఇది పొలాలు, చేన్లలో ఎక్కువగా పెరుగుతుంది. దీన్నే పాషాణబేది అని లేదా పిండి కూర అని కూడా పిలుస్తారు.
కొండ పిండి మొక్కను వేర్లతో సహా తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టాలి. తరువాత దాన్ని పొడి చేయాలి. ఆ పొడిని వస్త్రఘాళితం పట్టాలి. అంటే పలుచని వస్త్రంలో ఆ పొడిని వేసి జల్లించినట్లు చేయాలి. దీంతో కింద ఇంకా సన్నని పొడి పడుతుంది. దాన్ని సేకరించి నిల్వ చేయాలి.
పై విధంగా తయారు చేసుకున్న కొండ పిండి ఆకు పొడిని రోజూ ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటితో తీసుకోవాలి. భోజనం చేసిన అనంతరం గంటకు తీసుకోవచ్చు. ఇలా 40 రోజుల పాటు చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.
అయితే కిడ్నీల్లో రాళ్ల సైజ్ పెద్దగా ఉన్నవారు ఇంకో 40 రోజుల పాటు అదనంగా ఈ పొడిని వాడాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది.