Snoring : సాధారణంగా గురక వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా గురక పెట్టడం వల్ల పక్క వారు నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిద్రలో అధికంగా గురక పెడుతుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది. ఇలా నిద్రలో గురక రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొందరు అధిక ఒత్తిడి వల్ల అలసిపోయి ఇలా గురక పెడుతుంటారు. మరికొందరికి అనారోగ్య సమస్యల కారణంగా నిద్రలో గురక రావడం జరుగుతుంది.
ఇలా నిద్రలో గురక సమస్యతో బాధపడేవారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
* రాత్రి నిద్రపోయే సమయంలో ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకోవటం వల్ల గురక సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే పడుకునే సమయంలో ఒక వైపుకు తిరిగి పడుకోవడం వల్ల గురక రాదు.
* ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి కలుపుకొని తాగడం వల్ల గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
* రాత్రి పడుకునే ముందు పచ్చి అటుకులు తిని పడుకోవడంతో గురక నుంచి విముక్తి పొందవచ్చు. అయితే కొన్ని సార్లు జలుబు చేసినప్పుడు శ్వాసనాళాలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలోనూ మనకు గురక వస్తుంది. కనుక పడుకునేముందు గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగడం వల్ల శ్వాసనాళాలలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండటమే కాకుండా గురక రాదు.
* రాత్రి భోజన సమయంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల గురక సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉండటం చేత గురక సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుంచి తప్పించుకోవచ్చు.