Bitter Gourd : కాకరకాయను తినేందుకు చాలా మంది విముఖతను వ్యక్తం చేస్తుంటారు. కానీ కాకరకాయలను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. వైద్యులు కూడా రోజూ కాకరకాయ జ్యూస్‌ను తాగితే మంచిదని చెబుతుంటారు. కాకరకాయల వల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే కాకరకాయలను మోతాదుకు మించి తింటే మాత్రం సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కాకరకాయలను మోతాదులోనే తినాలి. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కదా అని చెప్పి వీటిని ఎక్కువగా తినకూడదు. అలాగే వీటి జ్యూస్‌ను సైతం ఎక్కువగా తాగకూడదు. రోజూ 30 ఎంఎల్‌కు మించకుండా జ్యూస్‌ను తాగవచ్చు. మరీ అతిగా కాకరకాయలను తీసుకుంటే పలు దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విరేచనాలు అవుతాయి. వాంతికి వచ్చినట్లు ఉంటుంది. పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది.
కాకరకాయలను అతిగా తినడం వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్తి ఏర్పడుతుంది. అది అజీర్తి విరేచనాలకు దారి తీస్తుంది. ఇక కాకరకాయలను ఎక్కువగా తింటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే చాన్స్‌లు ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన తలనొప్పి, షుగర్ లెవల్స్ గణనీయంగా పడిపోవడం, మూర్ఛ రావడం, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి.
కనుక కాకరకాయలను మరీ అతిగా తినకూడదు. ఇక కాకరకాయలను రోజూ జ్యూస్ తీసి 30 ఎంఎల్ మోతాదులో తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కాకరకాయలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ అతిగా తీసుకోరాదు అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.