మీరు గమనించారో లేదో వార్తలు చదివే న్యూస్ రీడర్లు నల్లకోట్ ధరిస్తారు. నల్లకోట్ మాత్రమే ఎందుకు ధరిస్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? స్టైల్ కోసమే ఈ కోట్ వేసుకుంటున్నారని అనుకుంటున్నారా? అయితే దీని గురించి తెల్సుకోవాల్సిందే. అమెరికాలోని కేటీఎల్ఏ5 అనే న్యూస్ ఛానల్ ఉంది. అందులో లిబర్టే ఛాన్ యాంకర్ గా పనిచేస్తోంది . ప్రతిరోజూలాగే ఇంటి నుండి న్యూస్ ఛానల్ కు బయలుదేరింది. ఆరోజు ఆమె తెల్లటి గౌన్ వేసుకొని స్టూడియోకు వచ్చి, వాతావరణానికి సంబంధించిన న్యూస్ చదువుతూ మరో చేత్తో స్టిక్ పట్టుకొని గరిష్ఠ కనిష్ట ఉష్ణోగ్రతలను చెబుతుంది.
ఆమె అలా న్యూస్ చెబుతుండగా కెమెరా లైటింగ్, ప్రోజక్షన్ వల్ల ఉష్ణోగ్రతల గరిష్ట, కనిష్ట నంబర్లు ఆమె బ్రెస్ట్, నడుము భాగాలపై రిప్లెక్ట్ అయ్యాయి. ఆమె ఆ సమయంలో నల్ల కోట్ ధరించకుండా, తెల్లటి గౌన్ లో ఉండటం వలనే అలా కనిపించాయి. ఆ వివరాలు ఉష్ణోగ్రతకు సంబంధించినవి అనిపించకుండా, ఆమె శరీర కొలతలుగా కనిపించాయి.
ఇది చూస్తున్న సీనియర్ కెమెరామెన్ వెంటనే లిబర్టేకు నల్ల కోట్ అందించి దానిని వేసుకోమని చెప్పాడు.తనకు జరిగిన సంఘటనను లిబర్టే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.ప్రస్తుతం న్యూస్ ఛానల్స్, సినిమా షూటింగ్ లలోనూ గ్రీన్ మేట్స్ ఉపయోగిస్తున్నారు. చాలా సులభతరంగా వీటిపై చిత్రీకరణ జరుపుకొని తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చు.అలాగే గ్రీన్ మేట్ ఉపయోగించడం వలన మనకు కావలసిన గ్రాఫిక్ విజువల్స్ ను ఈజీగా చేసుకోవచ్చు. అందుకనే న్యూస్ రీడర్స్, యాంకర్స్ నల్లకోట్ ధరించమని చెబుతారు. ఇలా చేయడం వలన లిబర్టే కు జరిగిన ఇబ్బందులు తలెత్తకుండా వాటిని ఉపయోగిస్తారు. అది నల్లకోట్ వెనుక ఉన్న అసలు రహస్యం.