Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఛేజింగ్ చేసిన టీం ఏది?

Admin by Admin
April 11, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మార్చి 12, 2006. 438 గేమ్. వేదిక : న్యూ వాండర‌ర్స్ స్టేడియం, జోహాన్నెస్ బర్గ్‌, సౌతాఫ్రికా. క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని అద్భుతం ఆవిష్కారం అయింది. 90 వ దశకం నుండి నిన్న మొన్నటి వరకు ఆసీస్, దక్షిణాఫ్రికా మధ్య పోరు అంటే నువ్వా నేనా అన్నట్టు కొనసాగేది. దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా మధ్య 2006 మొదట్లో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో నాలుగు వన్డేలు ముగిసేసరికి ఇరుజట్లు చెరి రెండు మ్యాచ్లు గెలిచి సీరీస్ 2–2 తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక అయిదవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు సైమన్ కటిచ్, ఆడమ్ గిల్ క్రిస్ట్ లు అర్థ శతకాలతో రాణించి మంచి ఆరంభ భాగస్వామ్యాన్ని అందించారు. దీన్ని రికీ పాంటింగ్ కొనసాగిస్తూ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని పూర్తి చేసుకొని, తన అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 164 స్కోర్ సాధించాడు.

చివర్లో మైక్ హస్సీ, సైమండ్స్, బ్రెట్లీ మెరుపులతో అప్పటికి వన్డేలలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ అయిన 434 పరుగులు సాధించారు. రికీ పాంటింగ్ దీనికి ముందు వన్డేలలో మొదటి ఇన్నింగ్స్లో లో అధిక స్కోరు 398 పరుగులు శ్రీలంక పేరు మీద ఉంది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే హంసపాదు లాగా మూడు పరుగుల వద్ద డిపానర్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. అసలే కొండంత లక్ష్యం, కానీ దక్షిణాఫ్రికా ఏమాత్రం వెనుకంజ వేయలేదు. గిబ్స్, స్మిత్ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని కొద్దికొద్దిగా కరిగిస్తూ వచ్చారు. మధ్యలో గిబ్స్, స్మిత్ వెనుదిరిగిన, వాళ్ళ స్థానంలో వచ్చిన వండర్ వాత్, మార్క్ బౌచర్ అద్భుతంగా రాణించి జట్టుని లక్ష్యం వైపు గా తీసుకువెళ్లారు.

what is the best team in chasing highest total in odi cricket

చివరి ఓవర్లో ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి . స్ట్రైక్ లో ఉన్న బౌచర్ సింగిల్ తీసి నాన్ స్ట్రైక్ లో ఉన్న ఆండ్రూ హాల్ కి బ్యాటింగ్ ఇచ్చాడు. హాల్ బౌండరీ బాది నాలుగు పరుగులు సాధించాడు. కానీ తర్వాత బంతికి అలాంటి షాట్ ఆడాలని చూసి అవుటయ్యాడు. దీంతో దక్షిణ ఆఫ్రికా తొమ్మిదో వికెట్ ని నష్టపోయింది, క్రీజులోకి మఖై నతిని వచ్చాడు. సింగిల్ తీసి స్ట్రైక్ ని బౌచర్‌కి ఇచ్చాడు. అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ, బంతిని తీసుకుని బ్రెట్లీ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, బౌచర్ బంతిని లాంగ్ ఆన్ మీదుగా బౌండరీకి తరలించాడు. అంతే అద్భుతం ఆవిష్కృతమైంది, డగౌట్ లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రహరీగోడ దూకి మైదానం లోనికి పరిగెత్తి బౌచర్ ని అభినందించారు.

అప్పట్లో ఒక జట్టు నాలుగు వందల పరుగులు సాధించడమే అద్భుతం, కానీ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత జాక్ కలిస్ తన జట్టు సభ్యులతో ఇలా అన్నాడు. ఇది 450 పరుగులు చేయగలిగిన పిచ్. మన ప్రత్యర్థి జట్టు 15 పరుగులు తక్కువ చేసింది, కాబట్టి మనం దీన్ని అవలీలగా చేదించవచ్చు అన్నాడు. ఈ వ్యాఖ్యలు దక్షిణాఫ్రికా జట్టు సభ్యుల‌ని బాగా ప్రభావితం చేసినట్లు ఉన్నాయి. మామూలుగా మొదటి ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేసిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతిని రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలుతాయి. కానీ, జాక్ కలిస్ ఈ మాట అన్నాడు అంటే తన జట్టుపై తనకున్న‌ నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. మరొక విశేషం ఏమిటంటే మ్యాచ్ ముందు రోజు రాత్రి హర్షల్ గిబ్స్ పీకలదాకా మద్యం సేవించాడు, ఈ మ్యాచ్ ని హ్యాంగోవర్ లో ఆడి తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శనని నమోదు చేశాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

Tags: odi cricket
Previous Post

త్రివిక్ర‌మ్ సినిమాల్లో హీరోల చంక‌ల్లో బ్యాగులుంటాయి.. ఎందుకు?

Next Post

బ్రాల‌ను వాడ‌డం మంచిది కాద‌ట‌.. దాంతో మ‌హిళ‌ల‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.