Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

ఇంట్లో అక్వేరియం, మ‌నీ ప్లాంట్ పెడుతున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..

Admin by Admin
May 26, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇంట్లో ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవద్దు మనకు కనీస అవగాహన ఉండాలి లేదంటే.. లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది ఇళ్లలో అక్వేరియం ఉంటుంది. అందులో రంగురాళ్లను, చేపలను వేసి పెంచుతుంటారు. ఇలాంటివి చూసినప్పుడు అందంగానే ఉంటాయి.. కానీ కొంద‌రు ఇత‌ర వ‌స్తువుల‌ను పెట్ట‌డంలోనూ త‌ప్పుల‌ను చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల చెడు జ‌రుగుతుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంట్లో ఉంచ‌కూడ‌ని వ‌స్తువుల గురించి అలాగే వాటిని ఇంట్లో ఎందుకు ఉంచ‌కూడ‌దు అన్న విష‌యాల గురించి ఓ లుక్కేద్దామా..! తొట్టిలో, గ్లాస్ పెట్టెలో నీళ్లు పోసి చేప‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల ఆ ఇంటి య‌జ‌మానికి అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌. మాన‌సిక ఆనందం కూడా క‌లుగుతుంద‌ట‌. అయితే అక్వేరియంను శుభ్రంగా ఉంచ‌క‌పోతే అప్పులు పెరుగుతాయి.. అందుక‌ని అక్వేరియాన్ని ఇంట్లో పెట్టుకునే వారు క‌చ్చితంగా దాని శుభ్ర‌త‌పై జాగ్ర‌త్త వ‌హించాలి.

అలాగే ఇంట్లో ప‌ని చేయ‌ని గ‌డియారాలు కూడా ఉండ‌కూడ‌దు. ఇంట్లో మ‌హా భార‌త యుద్ద స‌న్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, పోస్ట‌ర్లు అస్స‌లు పెట్ట‌కూడ‌దు. వీటిని ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల ఇంట్లోని వారికి అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయ‌ట‌. చాలా మంది ఇళ్లలో మ‌నీ ప్లాంట్స్ పెంచుకుంటారు. దాని వ‌ల్ల అదృష్టం, ధ‌నం క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తారు. నిజానికి మ‌నీ ప్లాంట్‌ల‌ను కూడా ఇంట్లో పెట్టుకుంటే కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే అంతా నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంద‌ట‌. దీంతో ఇంట్లోకి దుష్ట శ‌క్తులు వ‌స్తాయి..అయితే మ‌నీ ప్లాంట్‌ను పెట్టుకుంటే దాన్ని చాలా శుభ్రంగా ఉంచాలి. ఇక ఈ ప్లాంట్‌ను ఇంటి బ‌య‌ట పెంచుకోవ‌చ్చు. అలాగే ఇంట్లో క‌ప్పలు ఉండ‌కూడ‌దు. అలా ఉంటే ఆ ఇంట్లో ఉండే వారికి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ట‌.

do not make any mistakes if you have aquarium and money plant

ఇక త‌ల‌కు పైన వేలాయుధంతో కూడిన కుమార‌స్వామి బొమ్మ అస్స‌లు ఇంట్లో ఉండ‌కూడ‌ద‌ట‌. అలాగే ఇంట్లో అడుగు కంటే ఎక్కువ ఎత్తులో ఉండే దేవ‌తా విగ్ర‌హాల‌ను ఉంచుకోకూడ‌ద‌ట‌. వాస్తు ప్రకారం ఎక్కువ ఎత్తులో ఉండే విగ్ర‌హాల‌ను ఉంచుకోవ‌డం మంచిది కాదు. వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా అవి చ‌తుర‌స్రాకారం లేదా దీర్ఘ‌చ‌తుర‌స్రాకారంలోనే ఉండాల‌ట‌.వ్యాపార ప్రాంతానికి తూర్పు, ద‌క్షిణ దిక్కులో ఎక్కువ విశాలంగా ఉండేలా చూసుకోవాల‌ట‌. దీని వ‌ల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేసే వారు తూర్పు దిశ‌లో నిల‌బ‌డి పూజ చేయాలి. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ట‌. వ్యాపారంలో కూడా లాభాలు వ‌స్తాయ‌ట‌.

ఇంటికి ఎదురుగా వైద్య శాల‌లు, మాంసం దుకాణాలు, ఇనుము, ఇనుప వ‌స్తువులు త‌యారు చేసే షాపులు ఉండ‌కూడ‌ద‌ని వాస్తు చెబుతుంది. అలా ఉంటే ఆయా ఇండ్ల‌ల్లో నివ‌సించే వారికి అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయట‌. ఇంట్లో అంటే మనచేతుల్లో పని.. ఇంటి ఎదురుగా అవి ఉండకూడదు అంటే ఎలా అంటారేమో.. ఒక వేళ అలాంటి షాపులు మీ ఇంట్లో ఉంటే.. వాస్తు నిపుణులతో మీరు ఏం చేయాలో చేయించుకోండి.. ప్రతిదోషానికి ఒక నివారణ ఉంటుంది.. కొత్తగా ఇంట్లో అద్దెకు దిగేవాళ్లు, కొనేవాళ్లు అయితే ముందే అలాంటివి లేకుండా చూసుకోవచ్చు..!

Tags: aquariumMoney Plant
Previous Post

ఆస్త‌మా స‌మ‌స్య ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాల‌ను పాటించండి..

Next Post

స‌ముద్ర గ‌ర్భంలో ఉన్న ఆల‌యం ఇది.. దీని గురించిన ఈ విశేషాలు మీకు తెలుసా..?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!