సాధారణంగా పొట్లకాయలను ఇంటి పెరటిలోనే పెంచుతూంటాం. పొట్లపాదు ఒక్కసారి వేస్తే చాలు, ఇంటి పెరటిలో దట్టంగా పెరుగుతుంది. పొట్లకాయ సన్నగా పొడవుగా వుండి లేత ఆకుపచ్చరంగులో చారలతో వుంటుంది. కొన్ని పొట్లకాయలు నాలుగునుండి ఆరు అడుగులవరకు కూడా పెరుగుతూంటాయి. అయితే ఇది ముదిరితే రుచి తగ్గుతుంది. అందుకని చాలామంది అవి లేతగా వున్నపుడే కోసి వంటకాలకు ఉపయోగించేస్తారు.
చాలామంది పొట్లకాయలు తినటానికి ఇష్టం చూపరు కానీ, ఈ కూర వలన అనేక ఔషధ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. తరచుగా తీసుకోవడం మంచిదని, అయితే తీసుకునే మొత్తాన్ని తక్కువలో తీసుకోవాలని, దీనికి వేడి చేసే గుణం అధికంగా వుందని చెపుతారు.
పొట్లకాయకు పెరుగు, కొబ్బరి కలిపి, పొట్లకాయ పెరుగు పచ్చడిగా కూడా తయారు చేస్తారు. లేదా పొట్లకాయను కూరగా వండుతారు. పొట్లకాయ తింటే మధుమేహ రోగులకు ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెపుతున్నారు.